పి.వి.స్మారక చిహ్నం పెట్టిస్తా: మహానాడులో బాబు
posted on May 27, 2014 @ 2:52PM
కాంగ్రెస్‌పై రాజీలేని పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. టీడీపీపై కుట్రపన్నినవారు భూస్థాపితమయ్యారని వెల్లడించారు. ఆనాడు ప్రధానిగా పివి నరసింహ రావు అయితే ఆయనకు గౌరవించడం కోసం ఎన్టీఆర్ పోటీ పెట్టలేదని,కాంగ్రెస్ మాత్రం పివిని అవమానించిందని అన్నారు. ఢిల్లీలో పీవీకి స్మారకచిహ్నం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ఏ నాడు అధికారం కోసం పాకులాడలేదని, దేశం సుస్థిర పాలనకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. తాగు, సాగునీరు, మౌలిక వసతులకు ప్రాధాన్యత కల్పించామన్నారు. కాంగ్రెస్ అవినీతితోనే దేశ ప్రతిష్ట పోయిందని మండిపడ్డారు. దేశ సంపదను కొల్లగొట్టి విదేశాల్లో దాచుకున్నారని, అవినీతిపరులకు సహకరించి దేశాన్ని భ్రష్టుపట్టించారన్నారు. కాంగ్రెస్ పరిస్థితి ప్రాంతీయ పార్టీకన్నా హీనంగా ఉందని బాబు వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌కు 2 శాతం ఓట్లురాలేదని ఎద్దేవా చేశారు.