తలైవా మాటలు టీడీపీకి మేలు
posted on Apr 29, 2023 @ 11:26AM
ప్రముఖ సినీ నటుడు రజనీ కాంత్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైనప్పటికీ తెలుగుదేశం పార్టీకి మేలు జరిగే మాటలు చాలానే మాట్లాడారు. చంద్రబాబు వల్లె హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది. ఇటీవల తాను హైదరాబాద్ వెళ్లినప్పుడు న్యూయార్క్ నగరాన్ని చూసిన అనుభూతి కలిగింది.
చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని తలైవా పొగడ్తల వర్షం కురిపించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సమీపంలోనే ఉండటం రజనీ కాంత్ ప్రసంగం తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యాయి.
రజనీకాంత్ రాజకీయాలలో రావాలని తమిళ ప్రజలు చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటున్నారు. బాబా చిత్రం రజనీ చివరి చిత్రం అని అందరూ అనుకున్నారు. తమిళనాడులో రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా చాలా పేరు తీసుకువచ్చింది. ఆయన సినిమాలు ఓ వైపు విజయవంతం కావడం మరో వైపు రజనీ రాజకీయ ఆగమనంపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోవడం పారలల్ గా జరిగిపోయాయి. అయినా రాజకీయాలకు ఎప్పటికప్పుడు పుల్ స్టాప్ పెట్టాడు. సినిమాల్లో బిజీగా ఉంటూనే తమిళ ప్రజలతో మమేకమయ్యేవారు. రజనీ కురిపించిన ప్రేమానురాగాల కోసం తమిళ ప్రజలు పరితపించేవారు. ప్రజలతో రజనీకి పెరిగిన బాండింగ్ వల్లే రజనీ రాజకీయాల్లో రావాలన్న ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఆయన ఒకసారి హైదరాబాద్ వచ్చిన సమయంలో బీపీ విపరీతంగా పెరిగి జూబ్లిహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు రజనీ రాజకీయాల్లో వచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. నాటి నుంచి రాజకీయాల గురించి మాట్లాడని ఆయన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో హాజరై చంద్రబాబును ఆకాశాన్నెత్తేశారు.
చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఏపీ నెంబర్ వన్ కావడం ఖాయమన్న గ్యారంటీ ఇచ్చారు రజనీకాంత్. రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని, రాజకీయాలు మాట్లాడవద్దని అనుభవం చెబుతుందని రజనీ మరో మారు రాజకీయాల పట్ల తన అయిష్టతను వ్యక్తం చేశారు.
చంద్ర బాబుతో తనకు 30 ఏళ్ల ఫ్రెండ్ షిప్ ఉందని, దేశ , విదేశాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తి అని పొగడ్తలతో ముంచెత్తారు. ఫలానా పార్టీకి ఓటు వేయాలి, ఫలానా అభ్యర్థిని గెలిపించాలని రజనీకాంత్ చెప్పకపోయినా చంద్రబాబును అభినందించడం టీడీపీకి మేలు జరిగినట్టయ్యింది.