ఖమ్మంపై బాబు దృష్టి
posted on Aug 2, 2022 @ 1:50PM
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం ప్రతిపక్ష టీడీపీకి ఇప్పుడు ఎంతో కలిసివస్తోంది. జగన్ సర్కార్ అన్నిరంగాల్లోనూ ప్రజల ఆదరణను కోల్పోయింది. ఇటీవలి వరద ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయకార్యక్రమాల విషయంలో కూడా అనుకున్నంతగా జరగడంలేదు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఈ పరిస్థితులను పూర్తిగా వినియోగించుకుంటూ, పార్టీ వర్గాలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు పార్టీ వర్గాలకు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.
ఈ నూతనోత్సాహంతోనే ఆయన అన్ని జిల్లాల్లోనూ చురుగ్గా తిరుగుతూ ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుం టూ వారికి భరోసా ఇస్తున్నారు. అయితే ఈ పర్యాయం పొత్తు రాజకీయాలపట్ల టీడీపీ మొగ్గు చూపుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో బీజేపీతో సన్నిహితంగా మెలిగే ఆలోచనలో పడింది. కాగా, తెలంగాణాలో కూడా తమ పార్టీ మనుగడను ఆశించే అటు పార్టీకి ప్రాతినిధ్యం ఉండాలన్న ఆలోచనలో బాబు ఉన్నారు. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఒకప్పటి ఆంధ్రాలో భాగమైన ఖమ్మం జిల్లా ప్రస్తుతం మూడు భాగాలుగా విభజితమైనప్పటికీ అక్కడ టీడీపీ వీలయినన్ని స్థానాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు.
దీనికి తోడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగు ప్రజలు ఆంధ్ర ప్రాంతంవారన్న భావ నతోనే ఎక్కువగా ఉం టారు గనుక ఆ ప్రజలమనోభావాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలన్నది చంద్ర బాబు ఆలోచన అన్నది విశ్లేషకుల మాట. ఖమ్మం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ లో ఆ జిల్లా నుంచి పార్టీకి ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆనుకుని ఉండే ఖమ్మం జిల్లాలో అయితేనే కొన్ని సీట్లయినా గెలుపొందవచ్చనే నమ్మకంతో బాబు ఉన్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరూ తర్వాత టీఆర్ ఎస్‌లోకి జంప్ అయినప్పటికీ టీడీపీ అధినేత ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టారు. ఆంధ్రా సరిహద్దుల్లోని తెలంగాణా ప్రాంతం గనుక తప్పకుండా తమ పార్టీకి కొన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారంటున్నారు.
దీనికి తోడు తన ఖమ్మం జిల్లా పర్యటనకు అనూహ్య స్పందన రావడం ఆయన నమ్మకాన్ని బలపరు స్తున్నది. సుమారు ఇరవ య్యేళ్ల తర్వాత కూడా చంద్రబాబుకి తెలంగాణా ప్రాంత ప్రజలు ఆదరణతో దగ్గరవడం గతంలో ఆయన పాలనా విధాన ప్రభావమని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇపుడు భద్రా చలంలో బహిరంగ సభ విజయ వంతమయితే పార్టీ ఎంతో లబ్ధిపొందుతుంది. కాగా తెలంగాణా నుంచి కాంగ్రెస్ స్నేహ హస్తాన్ని చాచవచ్చు. కానీ వారితో కలిసి అడుగువేయడానికి బాబు సుముఖంగా లేరన్నది తెలి సిందే. ప్రస్తుతం బీజేపీ ఆయకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నది కనుక కమలనాధులతోనే తెలంగా ణాలో ముందడుగు వేయడానికి సంసిద్ధత తెలపవచ్చని అంటున్నారు. ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతునీయడం కూడా ఈ ఆలోచనతోనే జరిగిందని విశ్లేషకుల మాట. కాగా ఈ నెల 24న ఉమ్మడి ఖమ్మంలో చంద్రబాబు పర్యటనకు తెలంగాణ నుంచే కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా జన సమీ కరణ చేయనున్నట్లు సమాచారం.ఎలాగైనా సభను గ్రాండ్ సక్సెస్ చేయించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.