వలసలను చంద్రబాబు ఆపగలరా?
posted on Jun 14, 2012 @ 11:21AM
ఉప ఎన్నికల ఫలితాలు తెలుగుదేశంపార్టీకి వ్యతిరేకమైతే? ఈ ప్రశ్న తెలుగుదేశంపార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ ఎన్నికల ఫలితాల్లో టిడిపికి రెండేస్థానాలు దక్కవచ్చన్న లెక్కలు ఆ పార్టీని కుంగదీస్తోంది. ఈ లెక్కలే పార్టీ అధినేత చంద్రబాబును లొంగదీసిందనుకోవచ్చు. అందుకే ఆయన్ను ఎవరూ ప్రశ్నించినా ఉప ఎన్నికల ఫలితాలు ఆశాజనకమంటున్నారు. నిజంగా కూడా ఎన్నికల్లో రెండేస్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే పార్టీ మారటానికి ద్వితీయశ్రేణి, తృతీయశ్రేణి నేతలు సిద్ధంగా ఉన్నారు. వీరిని చేర్చుకోవాలని అటు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ ఎదురుచూస్తున్నాయి. ఈ పార్టీల మార్పుల గురించి అవగాహన ఉన్న బాబు జాతీయరాజకీయాల్లో చక్రం తిప్పి ఉంటే పార్టీలో ద్వితీయశ్రేణి కూడా కదలకుండా ఉండేది. ఎందుకంటే పదవులు లభించే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇలాంటి జాతీయరాజకీయాల ఆఫర్ ను కూడా ఇటీవలే చంద్రబాబు వదిలేశారు. దీంతో కార్యకర్తలు కూడా ఫలితాల తరువాత నిర్ణయం తీసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఒక ఎమ్మెల్యేను ఆపినట్లు తమను మాత్రం ఆపటం బాబుకు సాధ్యపడదని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.