వైకాపా క్రూర రాజకీయానికి కోడెల బలయ్యారుః చంద్రబాబు
posted on May 2, 2020 @ 11:57AM
నేడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ 74వ జయంతి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఆయన చేసిన సేవలను ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు.
‘‘ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, ఆపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల శివప్రసాద్ గారి సొంతం. ఈ లక్షణాలే రూపాయి డాక్టరుగా పేదలకు వైద్య సేవలందిస్తోన్న కోడెలను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రమ్మని పిలిచేలా చేశాయి.
ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయి. అలాంటి వ్యక్తి కుటుంబంపై 19 కేసులు పెట్టి, వైసీపీ నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారు. మానసికంగా కృంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేసారు. వైసీపీ క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణ. ఈరోజు కోడెల శివప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆయన ప్రజాసేవలను మననం చేసుకుందాం’’ అని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం, అపన్నులకు అండగా నిలిచి భరోసా ఇచ్చే గుండె ధైర్యం కోడెల శివప్రసాదరావు సొంతమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొనియాడారు. కోడెల జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేశారు. రూపాయి డాక్టరుగా పేదలకు అందించిన వైద్యసేవలే... కోడెలను ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రమ్మని పిలిచేలా చేశాయన్నారు.
ప్రజల్లో కోడెలను పల్నాటి పులిగా నిలిపాయన్నారు. అలాంటి వ్యక్తి కుటుంబంపై 19 కేసులు పెట్టి, వైకాపా నేతలంతా కాకుల్లా పొడుచుకుతిన్నారని మండిపడ్డారు. మానసికంగా కుంగదీసి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని దుయ్యబట్టారు. వైకాపా క్రూర రాజకీయానికి కోడెల మృతి ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఈరోజు కోడెల శివప్రసాద్ జయంతి సందర్భంగా ఆయన ప్రజా సేవలను మననం చేసుకుందామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.