సచివాలయం ముట్టడి చంద్రబాబు, నారాయణల అరెస్టు
posted on Jul 2, 2012 @ 2:46PM
సోమవారం ఉదయం ఇందిరాపార్క్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మహాధర్నా ప్రారంభించారు. ఈ ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విత్తనాలు ఇవ్వలేని ప్రభుత్వం రైతులకు ఏవిధంగా న్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు. రూ. 3 వేల కోట్లు వ డ్డీ మాఫీ ఇవ్వాల్సి ఉండగా రూ. 300 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. 10 శాతం మంది రైతులకు కూడా రుణాలు అందలేదని, పావలా వడ్డీ ఎక్కడా క న్పించడం లేదని బాబు దుయ్యబట్టారు. రైతలు వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సి వచ్చిందన్నారు. రుణాలను రీ షెడ్యూల్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అనంతరం అక్కడి నుంచి సచివాలయం ముట్టడికి చంద్రబాబునాయుడు, నారాయణలతోపాటు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్ళారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని చంద్రబాబు, నారాయణలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎన్ని అరెస్టులు చేసినా, ఇబ్బందులకు గురిచేసినా రైతుల కోసం తమ పోరాటం ఆగదని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.