చంద్రబాబు ఇంటికి నో ఎంట్రీ
posted on Jun 16, 2015 @ 6:08PM
ఓటుకు నోటు కేసు వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠ రేపుతోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎవరికి వారు సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబును ఈ కేసులో ఎలా ఇరికించాలా అని ప్రయత్నిస్తుంటే చంద్రబాబు వారిని ఎలా ఎదుర్కోవాలా అని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఏసీబీ మాత్రం ఎక్కడ ఏ చిన్న క్లూ దొరికినా వదలకుండా మరీ దర్యాప్తు చేస్తుంది. దీనిలో అత్యంత కీలకమైన తెలంగాణ నామినేటెట్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఆధారంగా ముఖ్యమంత్రితో పాటు పలువరికి నోటీసులు జారీ చేసేందుకు సన్నద్దమయ్యారు.
మరోవైపు చంద్రబాబు తన నివాసం వద్ద గట్టి భద్రతే ఏర్పాటు చేశారు. తమ సమాచారాన్ని లీక్ చేసే ప్రమాదం ఉందన్న అనుమానంతో కనీసం ఎవరిని తన ఇంటి వద్ద కలిసేందుకు కూడా ఒప్పకోవడం లేదు. ఎదైనా పనుంటే సెక్రటేరియట్‌కో లేదా క్యాంప్ ఆఫీసుకో కుదరకపోతే పార్టీ ఆఫీసులో వచ్చి కలవాలని కఠిన అదేశాలే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన గత ఐదురోజులనుండి వరుసగా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు జరుపుతున్నా.. సమాచారం బయటకు పొక్కే అవకాశం ఉందనే అనుమానంతో కనీసం పార్టీ నేతలను సమావేశాలకు దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది.