‘తెలంగాణా’ ఫై తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీనే

 

 

 

 

 

 

ప్రత్యేక తెలంగాణా విషయంలో మొదటగా నిర్ణయం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీనేనని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు వివరించారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి ముందుగా ఈ విషయంలో అభిప్రాయం చెప్పాల్సింది ఆ పార్టీనేనని బాబు అన్నారు.

 

కాంగ్రెస్ మొదట తన నిర్ణయం చెపితే, తాము అప్పటికప్పుడే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని బాబు అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆరో రోజు తన పాద యాత్ర చేస్తూ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డి చంచల్ గూడ జైలు నుండే తన రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారని చంద్ర బాబు ఆరోపించారు. తెలంగాణా విషయంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనేనని తేల్చాలని బాబు వ్యాఖ్యానించారు.

 

తెలంగాణా ఇవ్వకుండా తమ పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని బాబు ఆరోపించారు. అధికారంలో ఉన్న పార్టీ తమ నిర్ణయం చెప్పకుండా ప్రతిపక్ష పార్టీ నిర్ణయం చెప్పాలనడం ఎంత వరకూ సబబని బాబు అన్నారు. ఒకరు, ఇద్దరు ఉన్న పార్టీలు కూడా పత్రికలూ, చానళ్ళు పెడుతున్నాయని బాబు అన్నారు.