అయుత చండీయాగం... నాలుగో రోజు...
posted on Dec 26, 2015 @ 9:31AM
అయుత చండీయాగంలో నాలుగో రోజు శనివారం జరిగే కార్యక్రమాలు ఏవంటే... గురుప్రార్థన, గణపతి పూజ, ఏకాదశన్యాస పూర్వక చతుసహస్ర చండీ పారాయణాలు, నవావరణ పూజ, సప్తద్రవ్య మృత్యుంజయ హోమం, మహాసౌరం, ఉక్తదేవతా జపాలు, కుమారి - సువాసినీ - దంపతీ పూజ, మహా మంగళహారతి, విశేష నమస్కారాలు, తీర్థప్రసాద వితరణ. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ధార్మిక ప్రవచనాలు, సాయంత్రం కోటి నవాక్షరీ జపం, అష్టావధాన సేవ, మహా మంగళహారతి, విశేష నమస్కారాలు. నాలుగో రోజు యాగంలో అతిథిగా తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొంటారు.