అయుత చండీయాగంలో మూడోరోజు...
posted on Dec 25, 2015 8:45AM
మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తు్న్న అయుత చండీయాగం మూడోరోజుకు చేరింది. మూడోరోజు శుక్రవారం ఉదయం గురుప్రార్థన, గణపతిపూజ, ఏకాదశన్యాస పూర్వక త్రిసహస్ర చండీ పారాయణాలు, నవావరణ పూజ, నవగ్రహ హోమం, యోగిని బలి, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పునశ్చరణ, దంపతీపూజ, మహా మంగళహారతి, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు వుంటాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ధార్మిక ప్రవచనాలు వుంటాయి. మూడోరోజున ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామి, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి తదితరులు చండీయాగంలో పాల్గొంటారు.