జగన్ భాయ్ ఇక ఆటలు సాగవు... కేంద్రం హెచ్చరిక
posted on Jul 26, 2022 @ 3:00PM
పెళ్లికి వెల్లిన వియ్యపురాలిని ఆనక అందరూ స్టీలు గ్లాసులు బాగోలేదని మొట్టికాయలు మొట్టారట. అదు గో అలా అయింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంగతి. రాష్ట్రపతి ఎన్నికలయ్యేవరకూ జగన్ సర్కార్ అవసరాన్ని గుర్తించి చక్కగా పలకరించినవారంతా ఆ వెంటనే ఇలా అయితే ఎలా జగన్ అంటూ రాష్ట్ర ఆర్ధిక స్థితిని గురించి యక్షప్రశ్నలు వేసి, వెయ్యి అనుమానాలు ఇచ్చి వెనక్కి పంపారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఏపీ శ్రీలంక అంటూ ప్రజెంటేషన్ ఇచ్చి.. ఏపీని ప్రముఖంగా ప్రస్తావించారు. జాగ్రత్త పడాల్సిందే నన్నారు. ఆ తర్వాత ఏపీకి అప్పులిస్తున్న బ్యాంకులపై ఆర్బీఐ సీరియస్ అయింది.
ఇది మామూలు విషయం కాదు. ఎవరైనా ఏపీకి అప్పులివ్వాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. బ్యాం కులకు నోటీసుల ద్వారా ఆర్బీఐ కల్పించింది. ఏపీ తీసుకుంటున్న అప్పుల గురించి కేంద్రం సీరియస్ అయింది. ఈ కారణంగా జగన్ సర్కార్ అప్పుల స్థాయి విషయంలో అనుమానాలు బలమయ్యే అవకా శాలే కనప డుతున్నాయి.
అప్పులు సక్రమమా, అక్రమమా ఎక్కువా, తక్కువా అన్న వాటిని పక్కన పెడితే ఇంత కాలం పెద్దగా పట్టించుకోని కేంద్రం ఇప్పుడు కాస్త సీరియస్‌గా తీుకుందా అన్న అనుమానం తాజా పరిణామాల ద్వారా వస్తోంది. ఇన్నిరోజులు ఒకెత్తు ఇక నుంచి ఒకటి అన్నది కేంద్రం. ఇప్పటిదాకా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని చిన్నపిల్లాడిని చూసినట్టు కాస్తంత చూసీ చూడనట్టే ఉన్నకేంద్రం, ఆర్బీఐ ఇపుడు కళ్లు పెద్దవి చేశాయి. కానీ ఏపీ సర్కార్ అప్పుల మీద నడుస్తున్నది. బీజేసీ సర్కార్ ఈ విషయాన్ని ఇప్పుడు సీరియస్గా తీసుకుని వివరాలు డిమాండ్ చేసి ఆర్బీఐ నుంచి అప్పులకు అడ్డుకట్టవేస్తే ఆంధ్రా గతేమిటి. ప్రభు త్వానికి ఆర్ధిక కష్టాలు మెడకు చుట్టుకుంటాయి.
ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన అప్పుల పరిమితిని దాదాపుగా ఈ నెలలో దాటేస్తారు. అద నపు అప్పుల కోసం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. కానీ శ్రీలంక అనుభవాలు భయ పెడుతున్న సమయంలో కేంద్రం ఇక విచ్చలవిడిగా అప్పులకు ఏమాత్రం అవకాశం ఇవ్వదని భావిస్తున్నారు. అదే సమయంలో ఉచితాలపై ఇటీవల మోదీ వ్యాఖ్యలు కూడా కొంత మంది ఉదహరిస్తున్నారు. నగదు బదిలీ పథకాల్లో ఏపీ ముందు ఉంది. ఇలాంటి వాటిని మోదీ సహించరని బీజేపీ వర్గాలు చెబుతున్నా యి. మొత్తానికి బీజేపీ అప్పులు అందకుండా చేయడం కాదు కనీసం సహకారం అందివ్వకపోయినా ఏపీ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంటుంది.