పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రి పదవి వద్దన్నాడా?
posted on May 21, 2014 @ 4:43PM
ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ హవా నడుస్తోంది. తన అన్న చిరంజీవి కూడా అందుకోనంత గౌరవాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అందుకుంటున్నాడు. ఎన్నికలలో పోటీ చేయకుండా, ఒక్క ఎంపీ స్థానం కూడా తన పార్టీ అకౌంట్‌లో లేకుండా వున్నప్పటికీ ఎన్డీయే పార్టీల సమావేశానికి పవన్ కళ్యాణ్‌ని ఆహ్వానించారంటే భారతీయ జనతాపార్టీ పవన్ కళ్యాణ్‌ని ఎంత గౌరవిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా వుంటే రాష్ట్ర రాజకీయాలలో ఒక వార్త షికారు చేస్తోంది. మోడీ కేబినెట్‌లో పవన్ కళ్యాణ్‌కి మంత్రి పదవి ఆఫర్ చేశారని, అయితే పవన్ కళ్యాణ్ తనకు మంత్రి పదవి వద్దని సున్నితంగా తిరస్కరించారనే వార్తలు ప్రచారంలో వున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం వుందీ మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. కేంద్రమంత్రి పదవి వస్తుందంటే ఎంత పని చేయడానికైనా సిద్ధంగా వున్న రాజకీయ నాయకులన్న ఇలాంటి రోజుల్లో పిలిచి మంత్రి పదవి ఇస్తానంటే వద్దనేవారు ఎవరైనా వుంటారా? పవన్ కళ్యాణ్ పదవులకు మరీ అంత దూరంగా వుంటారా.. ఈ ప్రచారాన్ని నమ్మొచ్చా అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.