కుప్పంలో చంద్రబాబు గృహప్రవేశం
posted on May 25, 2025 @ 10:01AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో సొంత ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశం చేశారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం గ్రామ పరిధిలో రెండు ఎకరాల స్థలంలో చంద్రబాబు కొత్తగా ఇల్లు నిర్మించుకున్న సంగతి విదితమే. ఆ ఇంటిలో ఆదివారం (మే 25) చంద్రబాబు దంపతులు గృహప్రవేశం చేశారు. శనివారం (మే 24) రాత్రికే చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్, బ్రహ్మణి దంపతులు కుప్పం చేరుకున్నారు. చంద్రబాబు హస్తినలో నీటి అయోగ్ సమావేశంలో పాల్గొన్న అనంతరం అక్కడ నుంచి శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత నేరుగా కుప్పం చేరుకున్నారు.
చంద్రబాబు గృహప్రవేశ మహోత్సవానికి నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 30 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరైనట్లు అంచనా. చంద్రమాబునాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా ఎనిమిది సార్లు విజయం సాధించారు. ఆదివారం వేకువజామున 3 నుంచి 4 గంటల నడుమ గృహ ప్రవేశంను గోపూజ, పూజాది కార్యక్రమాలతో నిర్వహించారు.