అప్పుడు కావాలని ఇప్పుడు వద్దంటున్న సిబిఐ
posted on Jul 25, 2013 @ 11:08AM
అసలే స్కాములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో ఎదురు దెబ్బ తగిలింది.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనిమా గాందీ సన్నిహిత సహాయకుడు విన్సెంట్ జార్జ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది.
జార్జ్‌కి వ్యతిరేకంగా నమోదైన కేసును మూసి వేయాలంటూ సిబిఐ వేసిన పిటిషన్ కొట్టేసిన కొర్టు జార్జ్‌పై విచారణ కొనసాగించటానికి కావలసిన ఆదారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. సీబిఐ ప్రత్యేక కోర్టు జడ్జీ జెపియస్ మాలిక్ మాలిక్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
1984 నవంబర్ నుంచి 1990 డిసెంబర్ మధ్య కాలంలో జార్జ్ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని 2000 సంవ్సతరంలో కేసు నమోదయింది.. రాజీవ్‌గాందీకి ప్రైవేట్ కార్యదర్శిగా వ్యవహరించారు జార్జ్. ప్రభుత్వోద్యోగిగా ఉండి భారీ ఆస్తులను కూడబెట్టుకోవడంతో పాటు.. బ్యాంక్‌లో 1.5 కోట్ల రూపాయల నగదు కూడాబెట్టారని గతంలో సిబిఐ ఆరోపించింది. కానీ ఇప్పుడు అదే సిబిఐ కేసును మూసి వేయాలంటూ కోర్టుకు నివేదికను సమర్పించింది.
కానీ సిబిఐ వాదనను తప్పుపట్టిన కోర్టు జార్జ్ పై విచారణ జరిపి నివేదికను అందచేయాలని సిబిఐని ఆదేశించింది.. ఆగస్టు 30న అతన్ని వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుపరచాలని ఆదేశించింది.