తమిళనాడుకు కావేరి జలాలు వదిలేది లేదు..
posted on Sep 22, 2016 @ 10:54AM
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే సుప్రీం కోర్టు రోజుకి తమిళనాడుకి 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయమని ఆదేశించగా.. కర్ణాటక మాత్రం రోజుకి 3 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తామని.. కావేరిలోనే నీరు లేనప్పుడు వారికి మాత్రం ఎలా విడుదల చేయాలని సీఎం సిద్దరామయ్య సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కావేరీ జలాలను తమిళనాడుకు ఈనెల 23వ తేది వరకు వదిలేది లేదని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈనెల 23వ తేది తరువాత ఉభయ సభల్లో ఈ విషయం చర్చించి ఓ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతిని కలుస్తామని.. ఆరోజు కావేరీ జలాల పంపిణిపై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మాకే నీళ్లు లేవు, ఇక తమిళనాడుకు ఎక్కడి నుంచి నీళ్లు వదిలిపెట్టాలని ఆయన ప్రశ్నించారు. కాగా కావేరి జలాలను ఈనెల 21వ తేది నుంచి 27వ తేది వరకు తమిళనాడుకు వదిలిపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.