ఇక్కడే లేవు వాళ్లకేం ఇస్తాం.. సిద్ద రామయ్య
posted on Sep 21, 2016 @ 10:37AM
కావేరి నీటి జలాల వివాదం మళ్లీ మొదటికే వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో వాతావరణం కాస్త నెమ్మదిస్తుంది అనే లోపులోనే సుప్రీం కోర్టు తాజా తీర్పుతో అగ్నికి ఆజ్యం పోస్తున్నంత పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో కావేరి నీటిని 15 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశించగా.. ఆతరువాత కర్ణాటకలో ఏర్పడిన ఆందోళనల నేపథ్యంలో 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. అయితే దీనిలో భాగంగా తమిళనాడుకు రోజుకు 3 వేల క్యూసెక్కుల నీటిని వదలాలని సూచించగా.. అందుకు కోర్టు రోజుకు 6 వేల క్యూసేక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో సీఎం సిద్దరామయ్య సైతం సుప్రీం తీర్పుపై ఆభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కావేరి నదిలోనే నీరు లేనప్పుడు తమిళనాడుకు కావేరీ నదిలోనే నీరు లేనప్పుడు తమిళనాడుకు రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటి విడుదల ఆదేశాలను ఎలా అమలు చేయగలుగుతామని అన్నారు. కోర్టు తీర్పును అమలు చేయడం చాలా కష్టమని.. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరారు. మరోవైపు సుప్రీం తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.