కర్ణాటకలో మరోసారి చెలరేగిన ఆందోళనలు.. తమిళనాడు బస్సు దగ్ధం
posted on Sep 12, 2016 @ 4:15PM
కావేరి జలాలు తెలంగాణకు ఇవ్వాల్సిందే అని.. మేం చెప్పినట్టు చేయాల్సిందే.. అయితే 15 వేల క్యూసెక్కుల నీటిని కాకుండా.. 12 వేల క్యూసెక్కుల నీటిని ఇవ్వమని తాజాగా ఆదేశించింది. అయితే ఇప్పుడు దీనిపై మరోసారి కర్ణాటకలో ఆందోళనలు మొదలయ్యాయి. ఏకంగా తమిళనాడు నుండి వచ్చే బస్సులను సైతం తగలబెట్టే పరిస్థితి కర్ణాటకలో నెలకొంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం తమిళనాడు నుండి వాహనాలు కర్ణాటకలోకి రాకుండా చూస్తున్నారు. కర్ణాటక నుండి తమిళనాడుకు కూడా బస్సు సర్వీసులు నిలిపివేశారు. కేఆర్‌ఎస్ డ్యామ్ వద్ద 500 మంది పోలీసులను మోహరించారు. అంతేకాదు గుంపులుగా ప్రజలు ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. బెంగళూరులో మెట్రో సర్వీసులను తాత్కాలికంగా నిలిపేశారు.
ఇదిలా ఉండగా తమిళనాడులో కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. రామేశ్వరంలో కర్ణాటకకు చెందిన ఐదు టూరిస్ట్ వాహనాలను ధ్వంసం చేశారు. తమిళనాడులో కన్నడ హోటల్‌పై పెట్రోల్ బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.