చెప్పులు శుభ్రంగా ఉంటే ఒబెసిటీ రాదు..
posted on Aug 14, 2018 @ 1:00PM
వినడానికి వింతగా ఉంది కాదూ! కానీ ఇదెవ్వరో దారిన పోయే దాన్నయ్య చెప్పిన మాట కాదు... పోర్చుగల్‌లో కొంతమంది పరిశోధకులు తేల్చిన విషయం. మనలో చాలామందిలో ఒళ్లు పెరిగిపోవడానికి కారణం- శారీరక శ్రమ తక్కువగా చేస్తూ, ఎక్కువ కెలోరీలు ఉన్న ఆరాహాన్ని తీసుకోవడం అని తెలుసు. కానీ ఈమధ్యకాలంలో ఒబెసిటీకి మరో కారణం కూడా కనుగొన్నారు. అదే obesogens! ఇవి మన శరీరంలో కొవ్వుని ప్రభావితం చేసే ఒక రకమైన కెమికల్స్.
మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు ఈ obesogens పనితీరుని మార్చేస్తాయట. ఆహారపదార్థాలలో కనిపించే పెస్టిసైడ్స్, బ్యాటరీలలో ఉండే కాడ్మియం, బాత్రూం క్లీనర్లు, డియోడరెంట్లు... లాంటి నానారకాల కెమికల్స్ ఈ obesogens మీద పనిచేస్తుంటాయి. అలాగని వీటన్నింటికీ దూరంగా ఉండటం కష్టమే కదా! ఈ రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ కెమికల్స్ మన చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి. కానీ obesogensని తీవ్రంగా ప్రభావితం చేసే ఒక వస్తువుని మాత్రం మనం కంట్రోల్ చేయగలం. అదే చెప్పులు!
చెప్పులతో మనం ఊరంతా తిరిగి వస్తాం. దాంతో వాటికి నానారకాల కెమికల్స్ అంటుకుని ఉంటాయి. చెప్పుల మీద పేరుకునే దుమ్ములో ఆ కెమికల్స్ భద్రంగా ఉంటాయి. అవి రకరకాల అనారోగ్యాలు ఎలాగూ కలిగిస్తాయి. ఇక obesogens మీద కూడా తమ ఎఫెక్ట్ చూపుతాయి. అందుకే చెప్పులని ఇంటి బయటే విడిచిపెట్టేయాలనీ, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలనీ పోర్చుగల్ పరిశోధకులు సూచిస్తున్నారు. ఇంట్లో దుమ్ముని కూడా ఎప్పటికప్పుడు దులిపేయడం, కార్పెట్లులాంటివి వాడకపోవడం వల్ల కూడా కెమికల్స్ పేరుకోకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు.
https://www.youtube.com/watch?v=clFCJAz2o_0
- Nirjara