అమెరికాలో కదిలిన అదానీ అవినీతి తీగ.. ఏపీలో కదిలిన జగన్ అక్రమాల డొంక!

దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఏ అవినీతి తీగ కదిలినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ డొంక కదిలే పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన వైసీపీ, రాష్ట్రాన్ని అవినీతికి, అక్రమాలకు కేంద్రంగా మార్చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దగ్గర నుంచి పలు అంశాలలో వైసీపీ నేతల ప్రమేయం బయటపడింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దోచుకోవడం, దాచుకోవడమే పాలన అన్నట్లుగా ఐదేళ్ల అధికారాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ఇప్పుడు తాజాగా అమెరికాలో అదానిపై నమోదైన కేసులో కూడా జగన్ హయాంలో అవినీతి వ్యవహారాన్ని వెలుగులోనికి తీసుకువస్తోంది. 
ఇంతకీ విషయమేమిటంటే..అమెరికాలో భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానిపై లంచం కేసు నమోదైంది.  ఆ కేసేమిటంటే  గౌతమ్ అదానీ  అమెరికాలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ పేరుతో.. అక్రమ మార్గంలో నిధులు రాబట్టాలని భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచాలను ఆఫర్ చేశారు. దీనిపైనే    గౌతమ్ అదానీ సహా ఏడుగురిపై అమెరికాలో కేసు నమోదైంది.   అయితే ఆ కేసు తీగ అక్కడ కదిలితే ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల డొంక కదులుతోంది. అదానీ   20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకు నేందుకుగానూ భారత ప్రభుత్వ అధికారులకు   265 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 2 వేల 236 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్న అభియోగాల మేరకు కేసు నమోదైంది.  

మామూలుగా అయితే ఇండియాలో జరిగిన అవినీతిపై  అమెరికా లో కేసులు నమోదు చేయరు.  అయితే  న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజీలో లిస్టయిన కంపెనీ కావడంతో కేసులు నమోదయ్యాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఈ అవినీతి మూలం ఏపీలో ఉంది. ఓసియార్ ఎనర్జీ   ఏపీలో రూ.40 వేల కోట్లతో ఓసియార్ ప్లాంట్ పెట్టాలని జగన్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది.  అసలు అమెరికా అధికారులు ఏపీకి వచ్చి మరీ ఈ ఒప్పందంపై చర్చించారని,  ఏపీతో  ఒప్పందాల కోసం రూ.1750 కోట్ల లంచం ఇచ్చారు. ఈ వివరాలన్నీ అదానీపై అమెరికా నమోదు చేసిన కేసులో ఉన్నాయి.

ముఖ్యంగా అదానీ ఆంధ్రప్రదేశ్ లోనే మూడు దఫాలుగా అమెరికా అధికారులతో భేటీ అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి.   ముడుపుల విషయంలో ఒక అవగాహన కుదరడంతో 2021 జులై 2022 ఫిబ్రవరి మధ్య కాలంలో  ఒడిశా, జమ్మూకాశ్మీర్, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కొన్ని విద్యుత్ సరఫరా కంపెనీలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఇందన విక్రయ ఒప్పందం (పిఎస్ఏ) కుదుర్చుకున్నాయి.

వీటిలో  ఆంధ్రప్రదేశ్  విద్యుత్ సరఫరా కంపెనీలు దేశంలోనే అత్యధికంగా దాదాపు ఏడు గిగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల కోసమే అదానీ  1750 కోట్ల ముడుపులిచ్చారన్న అభియోగాలున్నాయి. ఈ డీల్ కుదరడంలో ఏపీ ప్రభుత్వంలో  ఓ ఉన్నతాధికారి అత్యంత కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. అదానీ కంపెనీతో విద్యుత్ ఒప్పందాలపై అప్పట్లోనే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణలన్నీ అక్షర సత్యాలని ఇప్పుడు అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడంతో తేటతెల్లమౌతోంది.