ఆహారంలో దాగి ఉన్న ఖనిజ లవణాలు

 

మనం తినే ఆహారంలోనే మన శరీరానికి కావలసిన అన్ని పోషక పదార్థాలు,ఖనిజ లవణాలు ఉంటాయి. అయితే ఏ ఆహారం తింటే ఎలాంటి లాభాలు ఉన్నాయి వాటిలో ఎలాంటి ఖనిజ లవణాలు దాగి ఉన్నాయి తెలుసుకోవటం ఎంతో  అవసరం.

 


ఐరన్: ఇది మన బాడికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రక్తం వృద్ధిచెందడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఇనుముని మనం గోధుమ, సజ్జలు, రాగులు, వేయించిన పల్లీలు, తోటకూరలలో ఎక్కువ మోతాదులో సంగ్రహించుకోవచ్చు పప్పుదినుసులు, జీడిపప్పులో కాస్త తక్కువ మోతాదులో ఉంటుంది ఈ ఇనుము.


కాల్షియం: ఎముకలు బలంగా పెరగటానికి పళ్ళ సంరక్షణకి నరాలు చురుగ్గా పనిచేయటానికి కాల్షియం ఎంతగానో ఉపకరిస్తుంది. బాదంపప్పు, క్యాబేజీ, చీజ్, పాల ఉత్పత్తులు,ఓట్స్, సోయాబీన్స్ వంటి వాటిని తీసుకుంటే కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.


 

అయోడిన్: థైరాయిడ్ గ్రంథిని నియంత్రణలో ఉంచే గుణం అయోడిన్ లో పుష్కలంగా ఉంది. అయోడిన్ లోపం ఉంటె పిల్లల్లో పెరుగుదల లోపిస్తుంది. అయోడైస్డ్ చేసిన ఉప్పు, వెల్లుల్లి, మష్రూమ్స్, సముద్ర ఆహారంలో మనకు అయోడిన్ ఎక్కువ మోతాదులో  దొరుకుతుంది.


విటమిన్ ఎ, సి: రోగనిరోధక శక్తిని పెంచే ఈ విటమిన్లు అధికంగా నెయ్యి, వెన్న, తియ్యని పాలు, గ్రుద్దులోని పచ్చసోన, పెరుగు ద్వారా దొరుకుతాయి. బొప్పాయి తోటకూర, మునగాకు, టమాట, క్యారెట్, పాలకూర వీటిలో విటమిన్ ఎ ఎక్కువగా లభిస్తే ఉసిరి, జామ, ఏపిల్, నిమ్మ వీటిలో విటమిన్ సి చక్కగా లభిస్తాయి.


జింక్: ఈ జింకు ఆవాలు, రాజ్మా, బాదం, ఎండుకొబ్బరి, పొట్టుతో ఉన్న శనగలు, చిక్కుడు గింజలు మొదలైన వాటిలో తగిన మోతాదులో  ఉంటుంది.

శరీర పోషణకి అన్ని ఖనిజలవణాలు సమపాళ్ళల్లో ఉండాలి. ఒకటి తక్కువైనా ముప్పే, ఒకటి ఎక్కువైనా ముప్పే. 

 

- కళ్యాణి