భద్రాచలంలో కుప్పకూలిన భవనం.. ఏడుగురు కూలీలు మృతి
posted on Mar 26, 2025 @ 5:18PM
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో బుధవారం ఘోర విషాదం సంభవించింది. పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్ లో నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవన నిర్మాణ పనులలో ఉన్న కూలీలు శిథిలాలలో చిక్కుకున్నారు.
కొందరిని స్థానికులు రక్షించారు. ఇప్పటి వరకూ అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఏడుగురు కూలీలు మరణించారు. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. మృతుల వివరాలు కూడా తెలియరాలేదు.