డుగ్గు డుగ్గుమని ఎన్‌ఫీల్డ్ మీదొచ్చేసింది!
posted on Aug 20, 2022 @ 12:55PM
పెళ్లి అనగానే అనేకానేక జాగ్రత్తలు తీసుకుంటూంటారు, మగ, ఆడ పెళ్లివారు. ఇది ఇంటి పరువుకి సంబంధించిన వ్యవహా రమూ కావడంతో. పెళ్లి కూతురువాళ్లు పెద్ద ఎత్తున బాజాభజంత్రీలతో పెళ్లి వేడుక దగ్గరికి వెళ్లడం.. అంతా చూసి తరిం చాల్సిందే. పెద్దల్లో ఉండో గొప్ప ఆనందం చూసితీరాలి, పిల్లలు .. రెండిళ్ల వారూ కలిసిపోయి ఆడుకుంటూంటారు. ఇది చాలా సహజంగా జరిగేది. కానీ భారీ పెళ్లి డ్రస్సు లో అమ్మాయి సిగ్గుపడుతూ రావడం మాట అటుంచితే ఏకంగా పెళ్లి కూతురు బుల్లెట్ ఎక్కి వచ్చింది! పెళ్లి మండపం దగ్గరికి పెళ్లి కూతురు రావడం, పెళ్లి తర్వాత అత్తారింటికి పంపే కార్యక్రమాలతో రెండు కుటుంబాలూ కాస్తంత ఇమోషన్ కావడం చాలా పరిపాటి. అయితే కాల క్రమంలో అత్యాధునిక పోకడలు చోటు చేసుకుని ఆ సంప్రదాయాలను కాస్తంత వెనక్కి నెడుతు న్నారు ఈ తరం తల్లిదండ్రులు.
ఉత్తరాది పెళ్లిళ్లలో బారాత్ పెద్ద స్థాయిలోనే జరుగుతుంది. ఇరు కుటుంబాల వారూ ఎంతో గొప్పగా చెప్పుకునే సందర్భం. పెళ్లి కొడుకు గుర్రం మీద వస్తాడు. వెనకనే సగం ఊరు కదిలి వచ్చినట్టు అతగాడి బంధుగణం అలంకరణలు, ఆభరణాలతో ధగధగ మెరిసిపోతూంటారు. ఇదో సంప్రదాయ వేడుకు. దీనికి అందరూ మంత్రముగ్ధులు కావాల్సిందే. కానీ ఇటీవలే ఒక అమ్మాయి ఈ సంప్రదాయ పద్ధతిని పూర్తిగా కాదన్నది. అంతేకాదు తానే మంచి డ్రస్‌లో ఏకంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ మీద పెళ్లి మండపానికి వెళ్లింది. దారిలో అంతా అమితాశ్చర్యంతో చూసి ఉంటారు.
కానీ అలా అత్యాధునికంగా రావడంలో, అందర్నీ అలా ఆకట్టుకోవడంలో ఆమె ఆనందానికి అంతే లేదు. బండి మీద రాగానే.. అదేవిటే, అలా దిగబడ్డావూ.. అంటూ వాళ్లింటో, వీళ్లింటో పెద్దామె ఎవరూ ప్రశ్నించలేదట! మేనమామ విసుక్కోలేదు, కాబోయే అత్తగారు మెటికలు విరవలేదు, మామగారూ ఆగ్రహించలేదు, పెళ్లి కొడుకు చిన్నబుచ్చుకోలేదు.. ఆమెను అలా రాగానే వెంటనే బండి నుంచి దింపి సాదరంగా, ఎంతో ప్రేమతో అందరూ పెళ్లి మండపం మీదకి బంగారు తల్లీ.. రావమ్మా.. అంటూ దిష్టి తీసి మరీ తీసుకువచ్చారు. అన్నట్టు ఇలాంటి ప్రయత్నాలు అక్కడేదో వూర్లో సాగింది.