బ్రిక్స్ సదస్సు.. గోవా చేరుకుంటున్న అగ్రనేతలు...
posted on Oct 15, 2016 @ 10:07AM
బ్రిక్స్ సమావేశానికి సర్వం సిద్దమైంది. గోవాలో జరిగే 8వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు అగ్రనేతలు ఇప్పటికే గోవా చేరుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టీమర్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాలు గోవా చేరుకున్నారు. విదేశాంగ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ కూడా కొద్దిసేపటిలో గోవా చేరుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా బ్రిక్స్ నేతలంతా అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఓ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయి. మరోవైపు గోవాలో అత్యాధునిక ఆయుధాలతో కూడిన పోలీసు బలగాలను మోహరించి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సమావేశ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, మార్గాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు.