అబ్బాయి కడుపులో గర్భసంచి.. ఎక్కడ..?
posted on Mar 19, 2016 @ 2:36PM
కొన్ని కొన్ని సార్లు కొన్ని సంఘటనలు వింటే చాలా విచిత్రంగా అనిపిస్తాయి. అయితే వినడానికి అవి విచిత్రంగా ఉన్న.. నిజం కాబట్టి నమ్మక తప్పదు. అలాంటి విచిత్రమైన ఘటనే తెలంగాణలో జరిగింది. సాధారణంగా గర్బసంచి అనేది ఆడవారిలో ఉంటుంది..కాని ఇక్కడ సృష్టి ధర్మానికి విరుద్ధంగా ఓ అబ్బాయి కడుపులో గర్భసంచి అభివృద్ధి చెందింది. వివరాల ప్రకారం.. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపెల్లి గ్రామానికి చెందిన కుర్ర శేఖర్, భారతిలకు వేణు కొడుకు. అయితే వేణుకు చిన్నప్పటి నుండి ఆడపిల్లల లక్షణాలు కనిపించాయి. దీంతో వేణు తల్లి దండ్రులు అతనిని పలు ఆస్పత్రులకు తిప్పేవారు. ఈక్రమంలోనే ఇటీవల ముస్తాబాదులోని పీపుల్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్ వేణు కడుపులో గర్భసంచిని గుర్తించారు. హిమోప్రోడిజం అనే వ్యాధి వల్ల వేణులో ఆడ, మగ లక్షణాలు కలగలసి కనిపిస్తున్నాయని శంకర్ అనే వైద్యుడు తేల్చారు. ఆ తర్వాత వేణుకు ఆపరేషన్ చేసి అతడి కడుపులోని గర్భసంచిని తొలగించారు.