నాకు వ్యతిరేకంగా కుట్ర ...... బొత్స
posted on Oct 9, 2013 @ 10:26AM
తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని రాష్ట్ర కాంగ్రెస్ పి. సి. సి చీఫ్ బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ప్రకటన తరువాత,నోట్ ఆమోదం అనంతరం తాను ముఖ్య మంత్రి కాబోతున్నట్లు వార్తలు ప్రచారం జరగటం ఆకుట్ర లోని భాగమేనన్నారు. విజయనగరం లో జరిగిన అల్లర్లను సాకుగా చూపించి తన మీద మరింతగా బురద చల్లే ప్రయత్నం జరుగుతోంది అన్నారు. రాష్ట్రాన్ని సమైఖ్యం గ ఉంచేందుకు తాను కూడా చాల ప్రయత్నం చేసానని,కాని మొత్తం నేపమంత తనమీదే వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించటం జరిగింది. అందరు రాజీనామాలు చేయటం ద్వారా రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తే తప్ప ఈ విభజన ప్రక్రియ ఆగదని తాను తెలియ చేసానని,అయితే తన మాట పెడ చెవిన పెట్టి ,నేడు తన మీదే అభియోగం మోపేందుకు కుట్ర పన్ని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బొత్స వ్యాఖ్యానించారు.