అడ్డంగా బుక్కయ్యారు!
posted on Jul 10, 2023 @ 10:23AM
తాజాగా విశాఖపట్నంలో ఆర్మీడ్ రిజర్వ్ సీఐ స్వర్ణలత.. నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరు వ్యక్తులను బెదిరించి నగదు గుంజుకొన్న కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో ఏపీ పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉల్కిపడింది. అయితే తాజాగా సీఐ స్వర్ణలత వ్యవహారం, గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి సీఐ, ప్రస్తుతం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఒకేలా ఉన్నాయనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో అలా ఇలా కాదు ఓ రేంజ్‌లో ఊపందుకొంది.
స్వర్ణలత.. సీఐగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘానికి ఉపాధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారని.. ఇటీవల విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆమె స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. అవి కాస్తా వివాదాస్పదం కావడంపై ఓ చర్చ సైతం సదరు సర్కిల్‌లో నడుస్తోంది.
అలాగే సీఐ స్వర్ణలత సినిమాల్లోకి వేళ్లాలని భావిస్తున్నారని... ఆ క్రమంలో ఆమె.. తన ఆటపాటలతో డ్యాన్సులు చేస్తున్న వీడియోలు.. సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయని.. అలాంటి వేళ సీఐ స్వర్ణలత వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమవుతోందని అంటున్నారు. పోలీస్ అధికారి అయి ఉండి.. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టడం ఏమిటనే ఓ వాదన అయితే గతంలో గట్టిగానే నడిచిందనే టాక్ పోలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. అదీకాక నోట్ల మార్పిడి వ్యవహరంలో కొందరు వ్యక్తులను బెదిరించి లక్షలాది రూపాయిలు కొట్టేశారంటూ అభియోగాల నేపథ్యంలో సీఐ స్వర్ణలత అరెస్ట్ అయ్యారు.
మరోవైపు 2019 ఎన్నికలకు ముందు దాదాపుగా ఇదే తరహాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరి సీఐగా గోరంట్ల మాదవ్ విధులు నిర్వహిస్తున్నారని.. ఆ సమయంలో తాడిపత్రిలో స్థానికంగా చోటు చేసుకొన్న ఓ వివాదం.. చినికి చినికి గాలీ వానగా మారడం.. ఆ సమయంలో అనంతపురం ఎంపీ, టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై వ్యాఖ్యలు చేయడం.. ఈ నేపథ్యంలో కదిరి సీఐ ప్లస్ పోలీస్ ఉద్యోగు సంఘం నాయకుడు గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి మీసం మెలేస్తూ.. జేసీకి వార్నింగ్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయని... ఈ అంశం నాడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆ తర్వాత గోరంట్ల మాధవ్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. జగన్ పార్టీలో చేరి హిందూపురం నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే. కానీ గతేడాది గోరంట్ల మాధవ్‌ది అంటూ చెబుతున్నో ఓ నగ్న వీడియో అయితే.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
అటు గోరంట్ల మాధవ్, ఇటు స్వర్ణలత.. ఈ ఇద్దరు పోలీస్ శాఖలో సీఐలుగా ఉన్నారని.. ఈ ఇద్దరు పోలీస్ అధికారుల సంక్షేమ సంఘంలో కీలక పదవుల్లో ఉన్నారని... అలాగే ఈ ఇద్దరు సీఐలుగా ఉండి.. స్వయంగా ప్రెస్‌మీట్లు పెట్టి.. టీడీపీ సీనియర్ నేతలపై విమర్శలు గుప్పించారనే అంటున్నారు.
దీంతో గోరంట్ల మాధవ్ తరహాలోనే సీఐ స్వర్ణలత సైతం తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. పోలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. రానున్న ఎన్నికల్లో ఏదో ఓ పార్టీ నుంచి పోటీ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.