ఎర్రబారిన ఎర్రకోట.. ఢిల్లీ బ్లాస్ట్ సూత్రధారులు వారేనా?
posted on Nov 11, 2025 8:34AM
ఢిల్లీ ఎర్ర కోట సమీపంలో సోమవారం సాయంత్రం 6. 52 గంటలకు కారు బాంబు పేలి మొత్తం 13 మంది చనిపోగా 24 మంది గాయపడ్డారు. ఎర్రకోట గేట్ వన్ దగ్గర్లోని ట్రాఫిక్ జంక్షన్ వద్ద వద్ద రెడ్ లైట్ పడడంతో.. హర్యానాకు చెందిన సల్మాన్ అనే వ్యక్తి పేరిట గల ఐ20 కారు ఆగింది. ఈ కారులో ఉన్నట్టుండి పేలుడు సంభవించింది. దీంతో స్పాట్ లో 9 మంది చనిపోగా 8 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల ఉన్న షాపులు కూడా దెబ్బ తిన్నాయి.
పహెల్గాం దాడి మరువక ముందే మరో విషాదం సంభవించింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు.. ఈ కారు వెనక సూత్రధారులెవరో వెతకడం మొదలు పెట్టారు. ఈ ఘటనతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడగా.. ముంబై, కోలకతా, హైదరాబాద్, చైన్నై సహా అన్ని మెట్రో నగరాల్లోనూ వంటి మిగిలిన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇక ఫోరెన్సిక్ అధికారులు ఘటనా స్థలిలో ఒక బుల్లెట్ స్వాధీనం చేస్కున్నారు. ఈ బుల్లెట్ ఇక్కడికి ఎలా వచ్చింది? దీని వెనక దాగి ఉన్న శక్తులెవరు? వారి కుట్రలేంటి? అన్న కోణంలోనూ దర్యాప్తు మొదలైంది.
ఇక ఢిల్లీకి రాష్ట్ర హోదాను వెంటనే రద్దు చేయాలని చాలా మంది డిమాండ్ చేయడం కనిపించింది. ఎందుకంటే రాష్ట్రంలో నిఘా కొరవడి ఎవరంటే వారు వస్తున్నారు కాబట్టి దాన్నొక సాధారణ సిటీగానే మార్చాలని అంటున్నారు. అప్పుడు మరింత నిఘా పెంచవచ్చన్న మాట వినిపిస్తోంది. కొందరైతే దీని వెనక కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదమే ఉండొచ్చన్న అంచనా వేస్తున్నారు. అయితే కాశ్మీర్ కాకుండా ఈ సారికి ఢిల్లీని ఎంపిక చేసుకోవడంలో అర్ధమేంటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.
అయితే ఇది ఇజ్రాయెల్ ఎంబసీ టార్గెట్ గా జరిగిన పేలుడుగా అనుమానిస్తున్నారు. ఇక పేలుళ్ల సమయంలో ఒక క్యాబ్ లో ఇద్దరు వ్యక్తులు దిగినట్టు గుర్తించారు. ఢిల్లీలో నివసిస్తున్న 30 మంది ఇరాన్ జాతీయులను సైతం ఇజ్రాయెల్ రివెంజ్ యాంగిల్లో ప్రశ్నిస్తున్నారు. శనివారం (నవంబర్ 8) ఒక క్యాబ్ డ్రైవర్ ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేశాడు. తన క్యాబ్ లో ప్రయాణించిన ఇద్దరి గురించి ఇతడు చెప్పినట్టు తెలుస్తోంది. .
ఇజ్రాయెల్ ని టార్గెట్ చేస్తే నేరుగా ఇజ్రాయెల్ నే టార్గెట్ చేయాలి. ఆ దేశంలోనే ఇలాంటి ఘటనకు పాల్పడాలి. కానీ, ఇలా ఇండియాలో ఇజ్రాయెల్ ఎంబసీని పేల్చాలనుకోవడం ఏంటి? అన్న చర్చ కూడా నడుస్తోంది.
ఈ పేలుడు తీవ్రత కారణంగా మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు వెనక సూత్రధారులెవరు? అని చూస్తే ఇద్దరు అనుమానితులను ఇప్పటికే అరెస్టు చేశారు.. ఇక హర్యానాకు చెందిన సల్మాన్ అనే వ్యక్తి కారుగా దీన్ని గుర్తించడం రెండో మేజర్ అప్ డేట్. ఇటీవలే ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ కన్నుగప్పి ఉగ్రవాదులు ఈ పేలుడు ఎలా ప్లాన్ చేశారన్న విషయమై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నది.
ఇలా ఉండగా ఢిల్లీ పేలుడు నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో నిఘా పెంచారు. భద్రత కట్టుదిట్టం చేశారు. టీటీడీ విజిలెన్స్ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తిరుమల నుండి తిరుపతికి వెళ్లే వాహనాలు, తిరుపతి నుండి తిరుమల వచ్చేవాహనాలను అన్నిటినీ తనిఖీ చేస్తున్నారు.