వెలిసిపోయిన కమలం!
posted on Oct 27, 2022 @ 11:59AM
పిల్లలు బాగా చదువుతామని తండ్రికి హామీ యిస్తారు, తప్పకుండా గెలపించాలని అభ్యర్ధులు తమ తమప్రాంతంలోని ఓటర్ల నుంచి హామీ తీసుకుంటారు, కానీ కేసులు లేకుండా చేస్తామని హామీ యివ్వడం మాత్రం బీజేపీవారివల్లే అయింది. ఇది కనీ వినీ ఎరుగని హామీ. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఎఫ్ ఐ ఆర్ లో అంశాలను చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. తమ పార్టీలో చేరండి అన్ని తామే చూసుకుంటామన్న ధీమా వ్యక్తం చేయడం. అందులోనూ వారికి ఎలాంటి క్రిమినల్ నేపథ్యం ఉన్నా తామే చూసుకుంటామనడం. ఇంతకంటే దారుణమైన హామీ ఎవరూ ఇవ్వరు. అంటే తమ పార్టీ బలపడేందుకు, తమ విజయానికి ఎలాంటి వారినయినా గట్టి పట్టున్నవారని తెలిస్తే లాగేసుకోవడానికి ఇంతటి హామీలను ఇచ్చి అక్కున చేర్చుకోవాలనుకోవడం బీజేపీవారి గొప్ప ఆలోచన.
ఈమధ్యవరకూ మా పార్టీలో చేరండి మీకు ఏదో ఒక మేలు చేస్తామన్న ధీమా ఇచ్చేవారు. అంటే సామాన్యంగా అనుకు నేది.. ప్రభుత్వ కార్యాలయాల్లో తమవారికి ఉద్యోగాలో, ఏదో ఒక పథకంలో భాగ స్వామి చేయడమో లేదా ఫ్రాజెక్టు కాంట్రాక్టులు లాంటివే.. కానీ రోజులు మారిపోయాయి. అంతే కోట్ల వ్యవ హారమే. అంతా డబ్బు మయం. కోట్లలో వస్తువుల్ని, భవనాల్ని కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనేయడం అనేది కేవలం కమలనాథుల బుర్రలోంచి వచ్చిన గొప్ప ఆలోచన. చిత్రమేమంటే ఇది భయానకమనో, ప్రజలు తమ రహస్యం తెలుసుకుంటే, బండారం బయటపడితే పోయేది తమ పరువేనన్న ఆలోచన, భయం లేకుండా ధైర్యంగా రహస్యంగా వ్యవహారం నడిపేయాలనే చూశారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఇపుడు ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్న అంశాల్నీ భీజేపీ వారి నీతి నిజాయితీని నాలుగు రోడ్ల జంక్షన్లో పెట్టేసిం ది. నిన్న మొన్నటి వరకూ టీఆర్ ఎస్ పరువు తీయడానికి ఒంటకాలి మీద లేచిన కమలనాథు లంతా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తన వ్యూహం తననే ముంచిందనేది బీజేపీవారే రుజువు చేయడం పెద్ద సినిమా కంటే అతి పెద్ద చిత్రమే చూపింది. ఎరవేయడం నలుగురిని లాక్కనేందుకు వ్యూహ రచన చేసామని జబ్బలు చరుచు కోవడం, మునుగోడు ఉప ఎన్నిక ముందే టీ ఆర్ ఎస్ కొంపముంచేసేమని ఏసీ గదుల్లో కూచుని హాస్య మాడుకోవడం, గట్టిగా నవ్వుకోవడం అంతా ఆ గదులకే పరిమితమై అసలు రంగు బయటపడింది. కాషాయం బాగా వెలిసిపోయి హేమా హేమీ నాయకుల బుర్ర తక్కువ తనం ఆసేతు హిమాచలమూ తెలిసిపోయింది. ఇక తమ పరువును తామే కాపాడుకోవాల్సిన పెద్ద పనిలో పడాల్సిన అగత్యం ఏర్పడిం ది. అధికారంలోకి రావడానికి వేసే వలలు టీ ఆర్ ఎస్ వ్యూహంతో ముక్కలయ్యాయి. చేపలు అను కున్నవారు చేపలు కాదని తమకు భవిష్యత్ అగమ్యగోచరం చేయగల టీ ఆర్ ఎస్ వీరాభిమాను లేనని తేటతెల్లమయింది. ఇపుడు తెలంగాణా అంతా తమదే నని రొమ్ము విరుచుకు ప్రచారం చేసుకుంటున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటివారు కేంద్రంలోని వారి మహా నేతలకు మొహం ఎలా చూపగలరో మరి. వ్యూహానికి, అమలుకి మధ్య చాలా తేడా ఉంటుంది. అందునా టీ ఆర్ ఎస్ వీరాభిమానులను అంత సులువుగా చేపల్లా లాగేసుకునే ఆలోచన బీజేపీ వారికి పెద్ద బూమరాంగ్ అయింది. ఇక తెలంగాణ బీజేపీ మహానేతలు దేశ తెలంగాణా ప్రజలకు, తమని నమ్ముకుని జండా పట్టుకు తిరుగుతున్నవారికీ సమాధానం చెప్పుకోవాలి.