ఆసక్తికరంగా మారుతున్న 'మహా' రాజకీయం...
posted on Oct 29, 2019 @ 5:37PM
మరాఠా రాజకీయం ఉత్కంఠ రేపుతోందిమహారాష్ట్రలో కుర్చీపై పేచీ ఇంకా కొనసాగుతోంది ముఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లపాటు పంచుకుందామంటూ శివసేన పెట్టిన ప్రతిపాదనపై సస్పెన్స్ కొనసాగుతోంది.లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ప్రభుత్వం ఏర్పాటుకు కలిసి వస్తామని సేన తేల్చి చెబుతోంది .ఈ సమయంలో రెండు పార్టీలు గవర్నర్ ను వేరు వేరుగా కలవడం ఆసక్తి రేపుతోంది . సీఎం కుర్చీని చెరి సగం పంచుకోవాలని శివసేన పట్టుబడుతోంది అటు బిజెపి మాత్రం దీనిపై నోరు మెదపడంలేదు. ఐదేళ్ల పాటు ఫడ్నవీస్ ఏ సీఎంగా ఉంటానంటూ పార్టీ శ్రేణులకు అధిష్టానం చెబుతూ వస్తోంది. బిజెపి మిత్ర పక్షాలు సైతం ఇదే మాట చెబుతున్నాయి. కానీ సేన మాత్రం లోక్ సభ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెబుతున్నారు.సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ శివసేన మధ్య సయోధ్య కుదురుతోందా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.దీనికి తోడు అక్కడ జరుగుతున్న పరిణామాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి,ఓ వైపు సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై అనుమానాలు కొనసాగుతుండగానే శివసేన బీజేపీ నేతలు మహారాష్ట్ర గవర్నర్ తో విడివిడిగా భేటీ కావడం సంచలనం రేపుతోంది.అయితే మర్యాద పూర్వకంగానే తాము గవర్నర్ ను కలిశామని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు.కొందరు కీలక నేతలతో కలిసి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలిశారు,మరోపక్క శివసేన బృందం సైతం గవర్నర్ తో భేటీ కావడం చర్చనీయాంశమైంది.
అధికారాన్ని సగం సగం పంచుకునేందుకు అంగీకరిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపితో కలిసి వస్తామని శివసేన పట్టుపడుతోంది.రెండున్నరేళ్లు తమకే సీఎం పీఠం కేటాయిస్తూ బిజెపి లిఖిత పూర్వక హామీ ఇవ్వాల్సిందే అంటోంది లోక్ సభ ఎన్నికలకు ముందు ఇదే హామీతో పొత్తు కుదిరిందని చెబుతున్నారు.రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బిజెపి నూట ఐదు స్థానాలు గెలుచుకుంది. రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో పోలిస్తే పదిహెడు సీట్లు బిజెపి తక్కువ గెలిచింది అటు శివసేనకు ఈ ఎన్నికల్లో యాభై ఆరు స్థానాలు దక్కాయి ఇందులో ఇద్దరు స్వతంత్రులు శివసేనకు మద్దతు పలికారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఈ రెండు పార్టీలకు కలిపి తగినంత బలం ఉంది.అయితే శివసేన మాత్రం తమ డిమాండ్ లు నెరవేరిస్తే తప్ప ముందుకు రామని భీష్మించుకుంది. ఇపుడిదే ప్రభుత్వ ఏర్పాటుకు ఆటంకంగా మారింది. అయితే అక్టోబర్ ముప్పైన అమిత్ షా మహారాష్ట్రకు వస్తున్నారు, దీంతో ఫడ్నవిస్ తో పాటు ఉద్దవ్ థాక్రే తో సమావేశం కానున్నారు.ఈ భేటీతో అయినా ఈ కధకు ఫుల్ స్టాప్ పడుతుందని చెబుతున్నారు.మరో పక్క బిజెపి లక్ష్యంగా శివసేన విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా మరోసారి తన పత్రిక సామ్నాలో ఆర్ధిక మందగమనానికి బిజెపియే కారణమంటూ కథనం రాసింది. కేంద్ర ఆర్ధిక విధానాల పై ప్రశ్నల వర్షం కురిపించింది.దేశంలోని రిటైల్ వ్యాపారం నానాటికీ పడిపోతోందని ఆన్ లైన్ వ్యాపారం ద్వారా విదేశాలకు లబ్ధి చేకూరుతోందని పేర్కొంది. బిజెపి ప్రభుత్వం తొలిసారి అధికారులకు వచ్చినప్పుడు తీసుకున్న నోట్ల రద్దు జీఎస్టీ ఆర్ధిక మందగమనానికి కారణమని విశ్లేషించింది.అధికారుల రిమోట్ కంట్రోల్ తమ చేతుల్లో ఉందంటూ శివసేన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.ఇప్పుడు మహరాష్ట్రాలో బీజేపీ కథనం చర్చనీయాంశమైంది.