ప్రచారానికి దావూద్...
posted on Mar 4, 2021 @ 11:40AM
ఎన్నికల ప్రచారంలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ఆలైఖైదా నేత బిన్ లాడెన్. వారి ఫోటోలే ప్రచారానికి కరెక్ట్. టీఆర్ఎస్ కు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఇచ్చిన ఉచిత సలహా ఇది. అధికార పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ లాంటి గొప్ప నేత ఫోటోను వాడుకోవడంపై బండి మండిపడ్డారు. టీఆర్ఎస్ కు పీవీ ఫోటో కాకుండా, దావూద్, బిన్ లాడెన్ ఫోటోలు పెట్టుకుంటే ప్రజలు గుర్తిస్తారని సెటైర్లు వేశారు. గులాబీ పార్టీ నేతలు పీవీ ఫోటోను ప్రచారానికి వాడుకుంటున్నా.. కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడం ఏంటని సంజయ్ ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే అని.. పరస్పరం కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు.
ఇక సమస్యలపై కేసీఆర్ ను అభ్యర్థించడం ఉండదు.. ఇక నుంచీ అన్నీ వార్నింగ్‌లే.. ఇదీ సీఎం కేసీఆర్ కు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఇచ్చిన వార్నింగ్. లక్షల కోట్లు దోచుకున్నందుకు కేసీఆర్‌కు జైలు జీవితం తప్పదని, ఆయన పతనం ఆరంభమైందని హెచ్చరించారు. పనిలో పనిగా కేటీఆర్ నూ నిలదీశారు బండి. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ కాగ్ నివేదిక ఇచ్చిన మాట వాస్తవమా? కాదా? దీనిపై మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.