బాలికను ముద్దాడిన బీజేపీ ఎమ్మెల్సీ అరెస్ట్..
posted on Jul 25, 2016 @ 1:18PM
ఈ మధ్య బీజేపీ నేతలు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఓ ఎమ్మెల్సీ ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆఖరికి అరెస్ట్ అయ్యాడు. వివరాల ప్రకారం.. బీహార్ బీజేపీ ఎమ్మెల్సీ టున్నా జై పాండే పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ లో హౌరా నుంచి గోరఖ్ పూర్ వెళుతున్నారు. ఈ క్రమంలో అతను ప్రయాణిస్తున్న బోగీలో.. అతని బెర్త్ కు సమీపంలో ఓ 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. అయితే రాత్రి సమయంలో ఆయన ఆ బాలిక బెర్త్ దగ్గరకి వెళ్లి ఆమెను ముద్దుపెట్టుకొని.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో భయపడిన బాలిక రైలు చైను లాగి.. తన తల్లి దండ్రులను పిలచి జరిగింది చెప్పడంతో అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరుపరచగా.. జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది కోర్టు. కాగా ఎమ్మెల్సీ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, దిగే స్టేషన్ దగ్గరగా రావడంతో... మొబైల్ ఛార్జర్ ప్లగ్ తీయడానికే బాలిక బెర్తు దగ్గరికి వెళ్లానని చెబుతున్నాడు.