ఏపీ సీఎం జగన్ పై విష్ణుకుమార్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
posted on Dec 9, 2020 @ 12:15PM
ఏపీ సీఎం జగన్ పై బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌ను నియంత అయిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో పోలుస్తూ విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఆంధ్రా కిమ్ జగన్ మోహన్ రెడ్డి అని సంబోధిస్తూ.. జగన్‌కు ప్రజల కష్టాలు ఏమాత్రం తెలియడం లేదని విమర్శించారు. గతంలో రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని సీఎం జగన్ చెప్పారని.. అయితే రెండున్నరేళ్ల తర్వాత ఏపీ సీఎం కూడా మారిపోవచ్చని అయన ఎద్దేవా చేశారు. ఉపముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చినట్లే.. ఏపీకి మొట్టమొదటి మహిళా సీఎంని చేసి జగన్ చరిత్ర సృష్టించాలని అయన అన్నారు. జగన్ సతీమణి భారతి రాష్ట్రానికి తదుపరి సీఎం అయితే ప్రజలు సంతోషిస్తారని.. అంతేకాకుండా ఆమె ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు తెలుసుకొని న్యాయం చేస్తారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని... మొన్న మార్చిలో అక్రమాలు జరిగినందున ఏకగ్రీవాలను రద్దు చేయాలని విష్ణుకుమార్ రాజు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.