కమలం ఫోకస్ ఇక తెలంగాణాపై
posted on May 8, 2023 @ 11:14AM
కర్ణాటకలో ఎన్నికల సమరానికి తెర పడుతున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్, బీజేపీ ఫుల్ ఫోకస్ తెలంగాణ పైనే ఉంది. దక్షిణాదిలో కీలకమైన కర్ణాటక, తెలంగాణ మీద కమలం ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో ఈ నెల 10న పోలింగ్ ఉంది. 13న ఫలితాలు విడుదల కానున్నాయి. కాబట్టి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కర్ణాటక పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయాలని బిజేపీ నిర్ణయించుకుంది. కర్ణాటక బార్డర్ లో ఎన్నికల సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. దీంతో ఆయా పార్టీల హేమాహేమీలు తెలంగాణను వరుసగా పర్యటించడానికి షెడ్యూల్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతకుమునుపు ప్రియాంక గాంధీ యువ సంఘర్షణ సభకు వస్తున్నారు. మరో వైపు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.సోమవారంతో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుండడంతో మర్నాడే తెలంగాణకు మోడీ వస్తున్నట్టు సమాచారం. వరంగల్ లో ఏర్పాటు చేసిన టెక్స్ టైల్ పార్కును ఆయన ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే అటు కాంగ్రెస్ ఇంకా బీజేపీ రెండు పార్టీలు కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడ్డాయి.
కర్ణాటకలో ఎన్నికల సమరానికి తెర పడుతున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్, బీజేపీ ఫుల్ ఫోకస్ తెలంగాణ పైనే ఉంది. దీంతో ఆయా పార్టీల హేమాహేమీలు తెలంగాణను వరుసగా పర్యటించడానికి షెడ్యూల్ ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతకు మునుపే ప్రియాంక గాంధీ యువ సంఘర్షణ సభకు రానున్నారు. మరో వైపు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
సోమవారంతో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుండడంతో మర్నాడే తెలంగాణకు మోడీ వస్తున్నట్టు సమాచారం. వరంగల్ లో ఏర్పాటు చేసిన టెక్స్ టైల్ పార్కును ఆయన ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే అటు కాంగ్రెస్ ఇంకా బీజేపీ రెండు పార్టీలు కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడ్డాయి.
ఇక దక్షిణాదిలో ఖాతా ఓపెన్ చేయడానికి చాలా కాలం నుంచి ఉవ్విలూరుతున్న కమలం పార్టీ కర్ణాటకలో ఎలాగైనా పాగా వేయాలని శత ప్రయత్నాలు చేస్తోంది. అది కాని సాధ్య పడితే..దాని ప్రభావం తప్పని సరిగా తెలంగాణపై ఉంటుందని భావిస్తోంది. దీని కోసం ఏ అవకాశాన్ని వదులుకోవద్దన్న వ్యూహంతో సరిహద్దుల్లో సభ నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల కోడ్ సమస్య లేకుండా జహీరాబాద్, నారాయణ పేట లేదా మరెక్కడైనా సభను నిర్వహించే అవకాశముందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
మరో వైపు తెలంగాణలో పార్టీని ప్రజలకు చేరువ చేయడానికి అనేక వ్యూహాలతో బీజేపీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం పై ఎటాక్ చేయడంతో పాటు కేంద్రమంత్రులు, ముఖ్యనేతల పర్యటనల ద్వారా పార్టీ క్యాడర్ లో కొత్త జోష్ ను నింపాలని స్కెచ్ వేసింది. దాంతో పాటు రాష్ట్రానికి వివిధ రంగాల అభివృద్ధి కోసం కేంద్రం ఇస్తున్న పథకాల గురించి కూడా ప్రజల్లోకి క్షేత్ర స్థాయిలో తీసుకొని వెళ్లాలని బీజేపీ భావిస్తోంది.