గుజరాత్ లో వికసిస్తున్న కమలం

 

కొద్ది నెలల క్రితం జరిగిన బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలపట్లగానీ, ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంతో బాటు ఎన్నికలకివెళ్ళిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఫలితాలగురించి గానీ పెద్దగా ఆసక్తి చూపని దేశవాసులు ముందుగానే ఊహించిన ఫలితాలకోసం గుజరాత్ వైపు ఆసక్తిగా చూస్తున్నారంటే అందుకు కారణం ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీయేనని చెప్పక తప్పదు.

 

అభివృద్ధి మంత్రం జపిస్తున్న మోడీని ఏవిదంగా ఎదుర్కోవాలో తెలియక కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అతని చేతిలో ఘోరపరాభవం తప్పదనీ తెలిసికూడా గుజరాత్ లో అతనిని డ్డీ కొనక తప్పలేదు. డ్డీ కొన్నపుడయినా తన స్వంత మేనిఫెస్టో గురించి చెప్పుకొనే బదులు, అతను రాష్ట్రంలో సాదించిన అభివృద్ధి గురించే తన ఎన్నికల సభల్లోనూ ప్రస్తావించక తప్పక పోవడం కాంగ్రేసుకి మింగుడుపడని మరో విషయం. సాక్షాత్ ప్రధాన మంత్రి డా.మన్మోహన్ సింగ్ సైతం రాష్ట్రంలో కొన్నిచోట్ల అభివృద్ధి జరిగిందని ఒప్పుకోవడం మోడీ యొక్క తొలివిజయంగా చెప్పవచ్చును. అందుకే ఫలితాలు కూడా అందుకు అనుకూలంగానే వెలువడుతున్నాయిప్పుడు.

 

ఇప్పుడే అందిన తాజా వార్తల ప్రకారం గుజరాత్ లో బీజేపీకి ౧౧౪ స్థానాలలొ ఆదిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలలో ఆదిక్యతలో ఉంది. మోడీని ఇబ్బందిపెట్టగల సమర్థుడు, అతని ఓట్లను చీల్చి కాంగ్రేసు తో ప్రభుత్వం ఏర్పరచగల ఒకే ఒక్కనేత అని భావించిన కేషుభాయి పటేల్ యొక్క గుజరాత్ పరివర్తన్ పార్టీ కేవలం అంచనాలకు పూర్తీ విరుద్దంగా కేవలం 82 స్థానాలలో పోటీ చేస్తే కేవలం 3 స్థానాలలో మాత్రమే ఆదిక్యతలో ఉండటం కూడా మోడీ ఎఫెక్టేనని చెప్పక తప్పదు. గానీ,

 

కాంగ్రెస్ పార్టీ ముందే ఊహించినట్లు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రస్తుతం ముందంజలో ఉంది. అక్కడ ఆ పార్టీకి 39 స్థానాలలో ఆదిక్యం ఉండగా, బీజీపీ మాత్రం కేవలం 22 స్థానాలలో ఆదిక్యత కనబరుస్తూ వెనక బడిపోయింది.