బిజెపి ఓకే..టీ బిల్లు ఆమోదం లాంఛనమే
posted on Feb 20, 2014 @ 10:19AM
తెలంగాణ బిల్లును రాజ్యసభలో ఆమోదించడానికి బిజెపి అ౦గీకరించినట్లు తెలుస్తోంది. బిల్లులో సూచించిన సవరణలను చేపట్టాల్సిందేనని పట్టుబట్టిన బిజెపి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సీమా౦ధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి ప్రధాని అ౦గీకరించడంతో బిజెపి వెనక్కి తగ్గినట్లు సమాచారం. దీనిపై ఈరోజు ఆయన రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు.
మరోవైపు సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలంటూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరారు. ఐదేళ్ల పాటు ఈ ప్రత్యేక హోదా కొనసాగడం వల్ల సీమాంధ్రకు పెద్ద యెత్తున నిధులు అందుతాయి. ప్రత్యేక ప్రతిపత్తి కల్పనకు ప్రభుత్వం ముందుకు రావడంతో బిజెపి బిల్లును ఆమోదించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.