Read more!

కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఎంత హాని చేస్తుందో తెలిస్తే!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇందుకోసం ఏవేవో చెయ్యక్కర్లేదు. తాజా ఆకుకూరలు, కూరగాయలు తింటుంటే ఆరోగ్యం ఆఫహే చేకూరుతుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆకుపచ్చ కూరగాయలు పండ్లను తినమని పెద్దలు చెబుతారు. అన్ని రకాల కూరగాయలు తిన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. కానీ చాలామంది కొన్నింటికి స్టిక్ అయిపోయి ఉంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా కొందరు కొన్ని కూరగాయలను, పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. అలాంటి వాటిలో కాకరకాయ కూడా ఒకటి. పిల్లలకు ఏమాత్రం ఇష్టం లేని ఈ కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా విపరీతంగా తింటే చెప్పలేనన్ని సమస్యలు వస్తాయి. 

కాకరకాయ తినడం వల్ల బరువు తగ్గవచ్చు, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. గుండె వేగాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కాకరకాయ ఉపయోగపడుతుంది. అయితే కాకరకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల బోలెడు నష్టాలు ఫేస్ చేయాల్సిందే.. ఏదైనా మితిమీరితే హానికరం అనే మాట తెల్సిందే కదా.. కాకరకాయను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై పడే చెడు ప్రభావాల గురించి నష్టాల గురించి తెలుసుకుంటే.. 

కాకరకాయ  తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని అందరూ అనుకుంటారు. అయితే సాధారణ వ్యక్తుల్లో షుగర్ లెవల్స్ సాధాణంగానే ఉంటాయి. ఇలాంటి వారు కాకరకాయను ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్స్ మీద ప్రభావం పడుతుంది. అలాగే అధిక షుగర్ లెవెల్స్ ఉన్నవారు షుగర్ కంట్రోల్ ఉండటానికి మెడిసిన్ వాడుతుంటారు. ఇలాంటి వాళ్ళు కాకరకాయ ఎక్కువ తిన్నా షుగర్ లెవల్స్ డౌన్ అవుతాయి. అలాగే, హిమోలిటిక్ అనీమియా ప్రమాదం కూడా కాకరకాయ ఎక్కువ తినడం వల్ల పెరుగుతుంది.

గర్భధారణ సమయంలో కాకరకాయను తినకూడదు. దీన్ని ఎక్కువగా తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు కాకరకాయకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 

కాకరకాయను ఎక్కువగా తీసుకునేవారికి కాలేయానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  కాకరకాయలో లెక్టిన్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల కాలేయంలో ప్రొటీన్ల కమ్యూనికేషన్ నిలిచిపోతుంది. అందుకే పొట్లకాయను రెగ్యులర్ గా, ఎక్కువగా తినకూడదు.

కాకరకాయ ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు, వాంతుల సమస్య పెరుగుతుంది. కాకరకాయలో బోలెడు ప్రయోజనాలున్నాయని దాన్ని ఇంట్లో వారికి, పిల్లలకు ఎక్కువగా వండిపెట్టే వారు దీనిగురించి తెలుసుకోవాలి. ఆరోగ్యానికి మంచిదే అయినా హాని కూడా కలిగించడంలో కాకరకాయ కూడా ఒకటనే విషయం మరచిపోకూడదు.

                                       ◆నిశ్శబ్ద.