వైసీపీ కొంపముంచిన భూమన మనసులో మాట!
posted on Aug 20, 2022 @ 12:01PM
మావోడు సక్రమంగా ఉంటే, ఈపాటికి నేనేడో ఉండేవోడిని, ముచ్చటగా కుర్చోరా అబ్బీ అంటే నా కమతం నా యిట్టం.. అని వెనకటికి ఒకాయన ఊరు వదిలే పరిస్థితి తెచ్చుకున్నాడు. నాయకుడిని నాయకులు, అభిమానులు ఆదరించాలి. ఆదరాభిమా నాలు కేజీల్లెక్కన మార్కెట్లో దొరకవు. సంపాదించుకోవాలి. తోటి వారే గేలిచేస్తే ఇక నాయకత్వం ఎందుకు, కుర్చీల దర్జా ఎందుకు? ఇపుడు ఇదే పరిస్థితి ఏపీలో వైసీపీ సర్కార్ అనుభవంలోకి వచ్చింది. నైతికత లేని రాజకీయాలు ప్రమాదకరమని, పతనం చెందిన వ్యక్తికి అధికారం వస్తే చేయగలిగిందేమీ లేదంటూ ఏకంగా వైసీసీ ఎమ్మల్యే భూమన కరుణాకర రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదేదో ఆషామాషాగా, సర్దాగా అన్నది కాదు. మనసులోంచి వచ్చినదే. ఆయనకు ఎప్పటినుంచో ఉన్న అభిప్రాయమే. కాబోతే పార్టీవారితో అనకుండా ఆ మాట సీజేఐ జస్టిన్ ఎన్వీ రమణ సమక్షంలో అనడమే వైసీపీలో గందరగోళానికి దారితీస్తోంది. ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి యిష్టా యిష్టాలు వారివి. అలాగని వేరేవాళ్లమీద రుద్దనవసరం లేదు. కానీ ఇది భూమన స్వంత అభిప్రాయం. ఇదే ఎక్కడినుంచో తెచ్చుకున్నది కానే కాదు. అదే ప్రకటించడం ప్రమాకరంగా మారింది. పైగా భూమన చేసిన వ్యా ఖ్యలు వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించేనన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్యే భూమన పునర్ముద్రించిన మహాత్ముడి ఆత్మకథ సత్యశోధన పుస్తక ప్రతులను శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జస్టిస్ రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కరుణాకర రెడ్డి మాట్లాడారు. పదవుల కోసం తల వంచేవాడిని కాదని, పదవుల కంటే నైతికంగా ఉత్తమ జీవితాన్ని గడపడమే గొప్పగా భావించేవాడినన్నారు. ఎమర్జెన్సీ సమ యంలో అరెస్టయి జైలు జీవితం గడిపిన సమయంలో ఎందరో మహామహులతో పరిచయం కావడం తనపై ఎంతో ప్రభావం చూపిందన్నారు. గొప్ప గమ్యాన్ని చేరడానికి చేసే ప్రయాణం కూడా అంతే గొప్పగా ఉండాలన్నారు. గాంధీ ఆత్మకథకు సంబం ధించి విస్మరించిన ఈకోణాన్ని ఇపుడు పదేపదే చదవాల్సిన అవసరముందన్నారు. గతంలో తీవ్రవాద భావజాలానికి ఆకర్షితు డినై చేసిన పనులను, తర్వాత రాజకీయాల్లో చేయాల్సి వచ్చిన తప్పిదాలను ఇపుడు భారత ప్రధాన న్యాయమూర్తి ఎదుట నిందితుడిగా చేతులు కట్టుకుని ఒప్పుకుంటున్నానన్నారు. 2006లో ఇద్దరు దుర్మార్గుల మాటలు విని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి తీరని అన్యాయం చేయడం ద్వారా అతిపెద్ద తప్పిదానికి పాల్పడ్డానన్నారు. సభ సాక్షిగా ఆయనకు క్షమాపణలు చెబుతున్నా నన్నారు.
సరే, భూమన తన తప్పులను కాయండని అన్నారు. తాను తప్పుచేశానని అంగీకరించారు. ఇది గొప్ప మనసుకి, వ్యక్తిత్వానికి తార్కాణం అంటున్నారంతా. తప్పును ఇలా అందరి సమక్షంలో అంగీకరించడానికి ఎంతో ధైర్యం కావాలని,భూమన తన తప్పు ను అంగీకరించడం చిన్న విషయం కాదని ఏకంగా జస్టిస్ రమణ పొగడ్తలతో ముంచెత్తారు. ఇంత మంచి నాయకుడిని తిరుపతి పట్టణ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రస్తుత రాజకీయాల తీరుపై జస్టిస్ రమణ వేదనా భరితమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే ఏవగించుకుని, అసహ్యించుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఉత్తమ నాయకత్వ లక్షణాలు, విలువలు, నిజాయితీ కలిగిన వ్యక్తులను, అవినీతికి పాల్పడని వారిని ప్రోత్సహించడం ద్వారా ప్రస్తుత రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరముం దన్నారు. సత్యశోధన... ప్రతి రాజకీయ నాయకుడూ చదవాల్సిన మొదటి, చివరి పుస్తకంగా ఆయన అభివర్ణించారు.
అయితే ఇదంతా భూమన ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నాయకుడిని మొట్టికాయలు వేయించాలన్న ఆలోచనతో చేశారా అన్న అనుమానం విశ్లేషకులకు ఉండనే ఉంది. అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయి మరీ తన మనసులో ఏమున్న ది, ఎంతలా బాధపడుతున్నానన్నది స్పష్టం చేయవచ్చు. కానీ పార్టీ సీనియర్లకు తనను కలిసి చర్చించేందుకు అవకాశం ఇవ్వ డం లేదా, పార్టీవర్గాలను, అభిమానులను రోడ్లమీద పడి పార్టీ విజయానికి కృషి చేయాలన్న ఆదేశాలతోనే దూరంగా పెడుతు న్నారా, హెచ్చరికలతో ఎలాంటి ఫిర్యాదులు, అభ్యర్ధనలకు ఛాన్స్ ఇవ్వడం లేదా అన్నది తేలవలసి ఉంది.
మంత్రులు, ఎమ్మె ల్యేలు ఇక మిగిలిన పాలనా కాలాన్ని ఎలాగో అలా నెట్టుకెళ్లి, వచ్చే ఎన్నికల్లో విజయానికి గట్టి కృషి చేసి తీరాలని గట్టి హెచ్చరి కలు చేస్తుండడం, పార్టీ పరంగా రాష్ట్రంలో తగ్గుతోన్న ప్రతిష్ట కూడా జగన్‌ను కలవరపెడుతోందనే అనాలి. అధికారంలో ఉండగానే నాలుగు పనులు చేసి నలుగుర్ని ఆకట్టుకోవాలన్న ధర్మసూత్రాన్ని నాలుగు రాళ్ల సంపాదనే అనే స్వీయ సూత్రాల ఆలోచనతో కట్టిపడేయడం ప్రజల మన్ననలకు వైసీపీ సర్కార్ దూరమయిందనే విశ్లేషకులు అంటున్నారు.