మొదటిసారి భారీ మెజారిటీతో గెలిచిన భట్టి!
posted on Dec 3, 2023 @ 2:29PM
మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో మల్లు భట్టి విక్రమార్క వరుసగా నాలుగోసారి గెలిచారు. మొదటి మూడు సార్లు తక్కువ మెజారిటీతోనే గెలుపొందిన భట్టి.. ఈసారి మాత్రం భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. ఈ నాలుగు ఎన్నికల్లోనూ భట్టికి ప్రత్యర్థి లింగాల కమల్ రాజే కావడం విశేషం.
2009 లో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన కమల్ రాజుపై భట్టి 1400 ఓట్ల తేడాతో గెలుపొందారు.
2014 లో సీపీఎం అభ్యర్థి కమల్ రాజుపై 12 వేల మెజారిటీతో విజయం సాధించారు.
2018 లో కమల్ రాజు టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థిగా బరిలోకి దిగగా 3500 ఓట్ల తేడాతో భట్టి హ్యాట్రిక్ కొట్టారు.
2023 లో కమల్ రాజు మరోసారి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవగా, భట్టి ఏకంగా 35 వేల భారీ మెజారిటీతో గెలిచారు.
2014 లో మాత్రమే మంచి మెజారిటీతో గెలిచిన భట్టి, ఈసారి భారీ మెజారిటీతో సంచలనం సృష్టించారు.