‘భలే మంచిరోజు’ షార్ట్ రివ్యూ
posted on Dec 25, 2015 @ 11:53AM
తారాగణం: సుధీర్‌బాబు, వామిఖ, ధన్య బాలకృష్ణన్, చైతన్యకృష్ణ, సాయికుమార్, వేణు, పోసాని కృష్ణమురళి. సంగీతం: ఎం.ఆర్.సన్నీ, కెమెరా: శ్యాం దత్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాతలు: విజయ్ - శశి, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య, నిర్మాణం: 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్.
‘భలే మంచిరోజు’ ఒక క్రైమ్ కామెడీ సినిమా. కథ విషయానికి వస్తే, రామ్ (సుధీర్‌బాబు) మెకానిక్ పని చేస్తూ వుంటాడు. తనను ప్రేమ పేరుతో మోసం చేసి మరో అబ్బాయిని పెళ్ళి చేసుకుంటున్న మాయ (ధన్య బాలకృష్ణన్)కి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో పెళ్ళి జరిగే ప్రదేశానికి తన స్నేహితుడు (ప్రవీణ్)తో కలసి కారులో బయల్దేరతాడు. అదే సమయంలో శక్తి (సాయికుమార్) సీత (వామిఖ)ను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తూ వుంటాడు. వీరిద్దరి కార్లూ ఒక ప్రదేశంలో ఢీకొంటాయి. ఈ ప్రమాదం సందర్భంగా సీత అక్కడి నుంచి పారిపోతుంది. సీతను వెతికి తీసుకురాకపోతే నీ స్నేహితుడిని చంపేస్తానని శక్తి రామ్‌ని బెదిరిసిస్తాడు. దాంతో సీతను వెతుకుతూ రామ్ బయల్దేరతాడు. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది. ఈ సినిమా ఫస్టాఫ్ చకచకా పరిగెడుతుంది. ద్వితీయార్థం మెల్లగా సాగుతుంది. కామెడీ బాగానే వుంది. సాంకేతిక నిపుణులు మంచి ప్రతిభ కనబరిచారు.