ఒంటిమిట్ట, భద్రాచలంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు..
posted on Apr 15, 2016 @ 12:31PM
శ్రీరామనవమి సందర్భంగా రాముని ఆలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో సీతా రాముని కల్యాణం చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా కడపజిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీ కోదండరామాలయంలో నవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి అతిధులుగా గంటా శ్రీనివాసరావు హాజరయి.. కోదండరాముడికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి కూడా హాజరయ్యారు.
ఇంకా ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవాలయం భక్తులతో పోటెత్తింది. నేటి తెల్లవారుజాము నుంచే ఆలయం ముందు ప్రత్యక్షమైన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు భద్రాద్రి వెళ్లి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.