పిల్లలు కళ్లజోడు పెడుతున్నారా? ఈ ఫుడ్స్ తింటే అవి అవసరం లేదు..!

కళ్లజోడు ఒకప్పుడు వయసైన పెద్దవాళ్లు వాడే పరికరం. అది కూడా పుస్తకాలు చదువుతున్నప్పుడో,  ఏవైనా తీక్షణంగా చూస్తూ పనులు చేస్తున్నప్పుడో మాత్రమే పెట్టుకునేవారు. కానీ ఈ డిజిటల్ యుగంలో  కంటి సమస్యలు లేనివారంటూ లేరు. చాలాశాతం మంది కళ్లజోడు లేకుండా కనిపించరు. దారుణమైన విషయం ఏమిటంటే చిన్నపిల్లలు కూడా కళ్లజోడుతో దర్శనమిస్తుంటారు.  బూతద్దాల్లాంటి కళ్లజోళ్లు పెట్టుకుని పిల్లలు కనిపిస్తుంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. అయితే ఈ సమస్యను ఆహారంతో అధిగమించవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు.  పిల్లలలో కంటిచూపుకు పదును పెట్టే  ఆహారాలేంటో తెలుసుకుంటే..

క్యారెట్..

కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్యారెట్ తీసుకోవడం  చాలా మంచిది. ఇది విటమిన్లు,  యాంటీఆక్సిడెంట్లకు నిధిలాంటిది. అంతే కాకుండా పిల్లల మెదడు ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తుంది. క్యారెట్లను ఏదో ఒక రూపంలో పిల్లల ఆహారంలో భాగం చేస్తుంటే కొన్నిరోజుల్లోనే కళ్ల జోడు అవసరం లేకుండా పక్కన పెట్టేస్తారు.

చిలగడదుంప..

కంటి చూపును మెరుగుపరచడంలో చిలగడదుంప కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎ,  సి లోపాన్ని భర్తీ చేస్తుంది.  కళ్ళజోడు వాడే పరిస్థితిని చాలావరకు తగ్గిస్తుంది.

పచ్చని ఆకు కూరలు..

చిన్న వయస్సులోనే  పిల్లల కళ్లు బలహీనంగా మారితే ఖచ్చితంగా ఆకు కూరలు, బచ్చలికూర, పాలకూర, తోటకూర,  మెంతి ఆకులు  మొదలైన వాటిని ఆహారంలో పెట్టాలి. ఇవి చాలా పోషకాల లోపాన్ని భర్తీ చేస్తాయి.

క్యాప్సికమ్..

క్యాప్సికమ్‌ను పిల్లల ఆహారంలో ఏదో ఒక రూపంలో చేర్చాలి. దీన్ని వెజిటేబుల్‌గా చేసి ఇచ్చినా లేదా సలాడ్‌లో కలుపుకుని  తీసుకున్నా ఆరోగ్యమే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.

                                                  *నిశ్శబ్ద.