Read more!

ఈఫుడ్స్ తో నెలసరి ఇబ్బందులకు చెక్!

ప్రతి ఆడపిల్లకూ నెలసరి తప్పనిసరి. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, పోషకాహారలోపం వంటి కారణాలతో అధిక రక్తస్రావం, కడుపునొప్పి, తీవ్ర భావోద్వేగాలు వంటికి కనిపిస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అవేంటో చూద్దామా.

ఆకు కూరలు:

ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని ఈ సమయంలో తింటే నొప్పులు తగ్గుతాయి. రక్తహీనత సమస్య అదుపులో ఉంటుంది. ఇందులోని మెగ్నీషియం మెదడుకి ఉపశమనం కలిగిస్తుంది.

అరటిపండ్లు:

ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇందులోని పొటాషియం ఒంట్లోని నీటిని నిల్వల్ను కోల్పోకుండా చేయడంతో డీహైడ్రేషన్ సమస్య ఎదురుకాదు. అంతేకాదు అరటిలో ఉండే ట్రిప్టోఫాన్ సెరటోనిన్ విడుదల చేస్తుంది. ఇది మెదడుకు ఉపశమనం అందిస్తుంది.

డార్క్ చాక్లెట్ :

నెలసరి సమయంలో ఒంట్లోని ప్రొజెస్టెరాన్ హార్మోన్ తగ్గడంతో ఈస్ట్రోజన్ పెరుగుతుంది. దీంతో ఒంట్లో చక్కెర స్థాయిలు తగ్గి నీరసం పెరుగుతుంది. దీంతో తీపి తినాలన్న కోరిక పెరుగుతుంది. ఇలాంటి సమయంలో డార్క్ చాక్లెట్ తినండి.

పెరుగు:

చాలామంది నెలసరి సమయంలో పెరుగు తినకూడదని చెబుతుంటారు. కానీ ఇది ఆ సమయంలో మంచి ఆహారమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఉండే కాల్షియం, పొత్తికడుపు నొప్పిని తగ్గించి, మూడ్ స్వింగ్స్ కి దూరంగా ఉంచుతుంది.