మెంతి కూర మంచిదే !

మెంతి కూర ఇదేంటి అని మాత్రం అనకండి. ఎందుకంటే మెంతి ఆకు తో చాలానే లాభాలు ఉన్నాయని తెలుస్తోంది .బ్లడ్ షుగర్ నియంత్రణ,బరువు ఊబకాయం తగ్గడం లో మెంతి ఆకు చాలా బాగా పనిచేస్తుంది మెంతి ఆకు వల్ల లాభాలు ఏమిటో చూద్దాం. చలికాలం లో పచ్చటి ఆకు కూరలు బగాలభిస్తాయి. పచ్చటి మెంతి కూర ఆకులు ఈ వాతావరణం లో లభిస్తాయి. ఈ ఆకుతో కూరవండుతారు. మెంతికూర పెసర పప్పు,మెంతికూర టమాట కాస్త చెడు గా తగిలినా నోటికి రుచిగా ఉంటుంది. మెంతికూర పప్పు అదుర్స్,మెంతికూర పరాటా ఇంకా అదుర్స్ఆరోగ్యానికి మంచిది. ఒక వేళా మీకు మార్కెట్లో మెంతికూర లేదా మెంతి ఆకు లభిస్తే తీసుకోండి మెంతి ఆకు వల్ల లాభాలు ఏమిటో తెలుసుకుందామా మరి.

బరువు...

మెంతి ఆకులో పీచు పదార్ధం అధిక మొత్తంలో ఉంటుంది. మెంతి ఆకు తినడం వల్ల మీకు ఆకలి వేయదు. మీపోట్ట నిండుగా ఉంటుంది.మెంతులు కూడా బరువు తగ్గించేందుకు దోహదం చేస్తాయి. మీరు బరువుతగ్గాలంటే మీరోజువారీ ఆహారం లేదా డైట్ ప్లాన్ లో కూరగా వాడండి.లేదా పులుసుగా వాడవచ్చు.

బ్లడ్ షుగర్...

మీ బ్లడ్ షుగర్ వస్తే మీకు మెంతి ఆకును తీసుకోవచ్చు. ఇందులో డయాబెటిస్ ను నియంత్రించే గుణాలు ఉన్నట్లు గుర్తించారు. మీ ఆరోగ్యానికి అత్యంత లాభాదాయకం కాగలదని నిపుణులు వివరించారు.

పంచేంద్రియాలు...

శరీరంలో ఉండే పంచేంద్రియాలలో వచ్చే సమస్యను దూరం చేయడం లో సహాయ పడుతుంది. అది గుండెకు సంబందించిన సమస్యలతో బాధపడే వారికి మెంతి ఆకు కూర తీసుకోవచ్చు.

కొలస్ట్రాల్...

శరీరంలో బ్లడ్ కొలస్ట్రాల్ ను పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమయం లో మీరు మెంతికూర తీసుకుంటే కొలస్త్రాల్ ను తగ్గించడం లో మీకు సహాయ పడుతుంది.

నోటి దుర్వాసన...

మీనోటి నుండి దుర్వాసన వస్తుంటే మెంతి ఆకును తినడం ద్వారా మెంతి ఆకు టీ తాగవచ్చు అలా చేయడం ద్వారా నోటి దుర్వాసన నుండి విముక్తి కల్పించడం లో సహాయ పడుతుంది మెంతి ఆకుకు సంబంధించి వచ్చే సమస్య నుండి దూరం చేసేది మెంతి ఆకు మాత్రమే అని నిపుణులు అంటున్నారు.