బఠాణి బహు మేలు

 


ఆకుపచ్చ బఠాణి కూరలో, రైస్ ఐటమ్స్ లో ఎలా వాడినా వాటి రుచి ప్రత్యేకంగా వుంటుంది. ఈ పచ్చి బఠాణీలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయితే వాటిని రుచి కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా, మన ఆహరంలో భాగం చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో మంచి పోషకాలు వున్నాయి.

1. వీటిలో న్యూట్రియంట్లు, విటమిన్లు, యాంటిఆక్సిడెంట్లు సంమృద్ధిగా వున్నాయి. బీన్స్ తో పోలిస్తే కాలరీలు కూడా తక్కువ. వంద గ్రాముల బఠాణిలలో కేవలం 81  కాలరీలు మాత్రమే వుంటాయి. కొలస్ట్రాల్ అస్సలు ఉండదు. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

2. ఇక ప్రేగ్నంట్ గా వున్నప్పుడు ఈ బఠాణీ ని తరుచూ ఆహరం లో చేర్చుకోవటం ఏంతో మంచిది. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్, బీ కాంప్లెక్స్ విటమిన్లు, అధికంగా వుంటాయి వీటిలో. అవి కడుపులోని బిడ్డ ఎదుగుదలకి ఎంతో మేలు చేస్తాయి.

3. ఇక పిల్లలకి, పెద్దవారికి ఈ బఠాణీని ఆహరంలో చేర్చుకోవటం ద్వారా "సి " విటమిన్ లభించి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.

4. ఇంకా ఈ బఠాణిల ద్వారా విటమిన్ " కె " " ఎ " కూడా లభిస్తాయి. ఎముకుల సాంద్రతని పెంచి, మెదడు పనితీరుని మెరుగు పరుస్తాయి ఆ విటమిన్లు. కంటి చూపు చక్కగా ఉండేలా చూస్తాయి.

5. వీలు అయినంత వరకు ఏదో ఒక రూపం లో పచ్చి బఠాణిని ఆహరంలో చేర్చుకోవటానికి ప్రయత్నించాలి. అన్ని రైస్ ఐటమ్స్ లో ఓ గుప్పెడు బఠాణి లని వేయటం, కూరలలో చేర్చటం వంటివి వాటి వినియోగాన్ని పెంచుతాయి. ఉడికించి చాట్ చేసి కూడా పెట్టచ్చు పిల్లలకి. ఆలు-బఠాణి, కాబేజీ-బటాని, ఇలా రకరకాల కాంబినేషన్లో ట్రై చేయచ్చు.