దేశభక్తి వుంటేనే లోకల్- వోకల్ నినాదం అర్థం అవుతుంది!
posted on May 15, 2020 @ 11:11AM
భారత ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ప్రధాని మోదీ రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. లాక్‌డౌన్ 4.0 ను సూచిస్తూ, దేశంలో లోకల్-వోకల్ ఫార్ములా అమలవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఫార్ములా ప్రకారం మన దేశం మునుపటి మాదిరిగా ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందట.
ప్రస్తుతం అమెరికా దగ్గర యుద్ధ విమానాలు, ఆయుధాలు కొంటున్నాము, ఇజ్రాయెల్ దగ్గర వ్యవసాయ సాంకేతికతని వాడుకుంటునము. ఇతర అన్ని దేశాల కంపెనీలు ఉన్నాయి కియో, ఉంది. ఎల్.జి. ఉంది అసలు సాఫ్ట్వేర్ ఎవరిది? గూగుల్ ఎవరిది? ఫేస్ బూక్ ఎవరిది? టిక్ టాక్ ఎవరిది? కెఎఫ్‌సి ఎవరిది? జామోటో ఎవరిది? ఫ‌్లిప్‌కార్ట్ ఎవరిది?
నిజంగానే ఇవన్నీ తక్షణమే బహిష్కరణ చేయడానికి భారత ప్రభుత్వం నిర్ణయించిందా? విదేశీ వస్తువుల వాడకం వద్దు. వోకల్ లోకల్ అని చెప్పిన వాళైనా చేస్తారా? అసలు కెఎఫ్‌సి వాళ్ళు నెల రోజుల కింద కోసిన చికెన్ లెగ్ పిసుల్ని ఇండియా కి దిగుమతి చేసుకుంటున్నాం. అలాంటి కెఎఫ్‌సిని మూసేస్తారా? వాల్‌మార్ట్ సూపర్ మార్కెట్ మూసేస్తారా? మన దగ్గర 4 జి టెక్నాలజీ సరిగా లేదు. చైనా, అమెరికా దగ్గర సూపర్ కంప్యూటర్ లు ఉన్నాయి. 7 జి, 8 జి. అంటున్నాడు.
కాబట్టి మనం దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం బహిష్కరించడం కాదు. ప్రభుత్వం విదేశీ పెట్టుబడులు, విదేశీ కంపెనీల్ని బహిష్కరించి స్వదేశీ వస్తువులు ఉపగించేలా చూడాలి. అసలు ప్రభుత్వం దృష్టిలో ఇలా వస్తూ బహిష్కరణ చేయడం చట్ట రీత్యా నేరం.
బీజేపీ ఆర్ ఎస్ ఎస్ తమ రాజకీయ పబ్బం గడుపు కోవడానికి ఇలాంటి తప్పుడు ప్రచారాలు అది కూడా అధికారికంగా చెప్పరు కానీ కింది స్థాయి లో మాత్రమే ప్రచారం చేస్తారు. అర్థం చేసుకోవడం రాజకీయ అవగాహన ని బట్టి ఉంటుంది. ఎ మాట వెనక ఎవరి ప్రయోజనం దాగి ఉందొ తెలుసుకోనంత వరకు మోస పోతూనే ఉంటారు దేశ ప్రజలు. అసలు మోదీ మాస్టారీ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ కేవలం దేశభక్తులకే అర్థం అవుతుంది. దేశద్రోహులకు కాదు.