డ్రామాలో గెలిచిన బంగ్లా.. ఎట్టకేలకు పాక్ కీ ఓ విజయం!
posted on Oct 30, 2022 @ 4:31PM
అనేక ట్విస్టులు సినిమాల్లోనే చూస్తాం.. డ్రామా అంతా చివరి భాగంలోనే చూస్తాం. హీరోని చంపేశానని విలన్ ఆనందంతో గట్టిగా అరుస్తూ వెళతాడు.. మరో అయిదు నిమిషాల్లో అసలు హీరో ఎంటవు తాడు.. విలన్ ఆశ్చర్యపడ తాడు..! ఇలాంటి ట్విస్టే టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం బ్రిస్బేన్‌లో జరిగిన బంగ్లాదేశ్, జింబాబ్వే మ్యాచ్ చివరి దశలో జరిగింది. చివరి నాలుగు ఓవర్లు జింబాబ్వే బ్యాటర్లు బాగానే ఆడారు, కానీ కీలక బ్యాటర్ పెవిలియన్ దారి పట్టించడంతో బంగ్లదేశ్‌కు గెలిచే అవకాశం వచ్చింది. టాస్ గెలిచి ముందు బ్యాట్ చేసిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో నజముల్ శాంటో అద్భుతంగా బ్యాట్ చేశాడు. అతను 71 పరుగులు తీసి వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
జింబాబ్వే చివరి ఓవర్లో చివరి 2 బంతుల్లో 5 పరుగులుచేయాలి. చివరి బ్యాట్స్‌మెన్.. బంగ్లా స్పిన్నర్ హొస్సేన్ వికెట్ తీశాడు. రిచర్డ్‌ను కీపర్ స్టంపింగ్ చేయడంతో మ్యాచ్ అయిపోయిందని అంతా సంబరపడ్డారు. ప్లేయర్లంతా దాదాపు వెళిపోయారు.. డగౌట్ దగ్గర ఉండగా వెనక్కి రమ్మని అంపైర్ పిలిచారు. కారణం కీపర్ స్టంపింగ్ సమయంలో బంతిని స్టంప్‌ల ముందే పట్టుకోవ డంతో నోబాల్ కావడంతో రిచర్డ్ నాటౌట్‌గా ప్రకటించారు. అంతే మళ్లీ అంతా వచ్చారు. ఫ్రీహిట్ కూడా కావడంతో వీడెక్కడ ఫోరో సిక్స్ గానీ కొడతాడో నని అంతా కళ్లప్పగించి చూశారు.. తీరా ఆ తర్వాతి.. చివరిది మళ్లీ వేసిన చిట్టచివరి బంతికి పరుగుతీయ లేక పోయాడు.హమ్మయ్య..అనుకున్నారంతా.. బంగ్లా గెలిచిన ఆనందాన్ని ఇంకాస్త కొనసాగించింది.. ఒకే మ్యాచ్ రెండు సార్లు గెలవడం అంటే ఇదే మరి! ఇలా ఎన్నడూ జరగ లేదు. మొత్తానికి బంగ్లాదేశ్ జింబాబ్వే పై 3 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజ యంతో బంగ్లాదేశ్ గ్రూప్ 2లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 గెలిచి రెండో స్థానంలోకి వెళ్లింది. జింబాబ్వే 3 మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచి 4వ స్థానంలో నిలిచింది.
ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో షాదాబ్, రిజ్వాన్‌లు విజృంభించడంతో పాకిస్తాన్ నెదర్లాండ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముం దుగా బ్యాట్ చేసిన నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 91 పరుగులే చేసింది. పాకిస్తాన్ 13.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 95 పరు గులు చేసింది. పాక్ బౌలర్ల ను నెదర్లాండ్స్ ఎదుర్కొనడంలో ఘోరంగా విఫలమయింది. షాదాబ్, ఆఫ్రిదీ, రావూఫ్, వాసిమ్, నజీమ్ అందరూ ఈ మ్యాచ్‌లో మంచి ఫామ్‌లోకి వచ్చారు. ముఖ్యంగా షాదాబ్ నాలుగు ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. నెదర్లాండ్స ఇన్నింగ్స్‌లో కాలిన్ అకర్మాన్ మంచి బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శించి 27 బంతుల్లో 27 పరుగులు చేశాడు. పాక్ ఇన్సింగ్స్ ఆరంభం నుంచే రిజ్వాన్ దూకుడుగా ఆడుతూ నెదర్లాండ్స్ బౌలర్లను ఇబ్బందిపెట్టాడు. కానీ మరో వంక కెప్టెన్ బాబర్ అజామ్ మాత్రం అదే పేలవ ప్రదర్శనతో ప్రేక్షకులను నిరాశపరిచాడు. అతని తర్వాత వచ్చిన ఫకర్ జమాన్ రిజ్వాన్ తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. ఇద్దరు 31 బంతుల్లో 37 పరుగులు చేశారు. ఇద్దరూ ధాటిగా ఆడుతుండ డంతో వీరే మ్యాచ్‌ని పూర్తిచేస్తారనిపించింది. కానీ ఆ వెంటనే స్కాట్ ఎడ్వర్డ్స్ అద్బుత క్యాచ్ పట్టడంతో ఫకర్ జమాన్ వెనుది రగాల్సి వచ్చింది. అప్పటికి అతను 20 పరుగులు చేశాడు. రిజ్వాన్ మరింత వేగంగా పరుగులు చేయడంలో అర్ధసెంచరీ పూర్తి చేయా ల్సింది కానీ ఒక్క పరుగు దూరంలో పెవిలియన్ దారి పట్టాడు. మొత్తానికి పాకిస్తాన్ స్వల్ప లక్ష్యాన్ని అధిగమించ డానికి 4 వికెట్లు కోల్పోయింది. అయితే చిన్న ఆనందమేమంటే, ప్రస్తుతం ఈ టోర్నీలో ఇదే పాక్ సాధించిన తొలి విజయం. అంతేగాక ఆస్ట్రేలియాలో టీ 20 తొలి విజయం కూడా ఇదే!