బీజేపీ కార్పోరేటర్లకు రూ.5 కోట్లు ఆఫర్ !
posted on Dec 24, 2020 @ 4:04PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓడినా కేసీఆర్‌కు అహంకారం తగ్గలేదని వ్యాఖ్యానించారు. . గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికను వెంటనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ కార్పోరేటర్లకు టీఆర్‌ఎస్ 5 కోట్లు రూపాయలు ఆఫర్ చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ మా జోలికొస్తే వాళ్ల ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటామని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ పోలీసులు నిజంగా హీరోలేనని మరోసారి స్పష్టం చేశారు బండి సంజయ్. 15 నిమిషాలు ఓల్డ్ సిటీని అప్పగిస్తే జల్లెడ పడుతారని చెప్పారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాళ్లను బయటకు తీస్తారని చెప్పుకొచ్చారు బండి సంజయ్. ఖమ్మంకు చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. టీఆర్ఎస్ సర్కార్ పై , సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పతనం మొదలైందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఖాయమని చెప్పారు.