నేను ఏ తప్పు చేయలేదు.. రోహిత్ పేరు రాయలేదు.. దత్తాత్రేయ
posted on Mar 1, 2016 @ 2:35PM
లోక్ సభలో రోహిత్ ఆత్మహత్యపై దుమారం రేగుతూనే ఉంది. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ.. మాయవతి మధ్య మాటలయుద్ధమే జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మొదటిసారిగా లోక్ సభలోనోరు విప్పారు. అయితే ఆయన తన ప్రసంగం ప్రారంభించారో లేదో.. విపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. అనంతరం ఆయనమాట్లాడుతూ.. నాకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది.. ఈ 40 ఏళ్లలో నేను ఏ తప్పు చేయలేదని అన్నారు. రోహిత్ ఆత్మహత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. రోహిత్ విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు.. అసలు హెచ్ఆర్డీకి రాసిన లేఖలో రోహిత్ పేరు ప్రస్తావించలేదని చెప్పారు. విపక్షాలు అనవసరంగా నాపై విమర్శలు చేస్తున్నారని.. నాపై దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు.