మహానాడులో హరి, బాలయ్యలే ప్రత్యేక ఆకర్షణ
posted on May 27, 2014 @ 5:31PM
హైదరాబాద్ గండిపేటలో జరుగుతున్న తెలుగు దేశం పార్టీ 33వ మహానాడులో న౦దమూరి బ్రదర్స్ హరికృష్ణ, బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరికంటే ముందుగానే వేదిక దగ్గరకు వచ్చిన నందమూరి హరికృష్ణ నేతలందరిని పలకరిస్తూ సభ వేదికపైన సందడి చేస్తూ కనిపించారు. ఆ తరువాత చంద్రబాబుతో కలిసి బాలకృష్ణ వేదికపైకి వచ్చారు. వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చంద్రబాబుతో విభేదాలున్నాయని భావిస్తున్న తరుణంలో హరికృష్ణ మహానాడుకి రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎన్నికలకు ముందు హరికృష్ణ, బాబు మధ్య విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే టిడిపి అధికారంలోకి వచ్చాక హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు హరి మహానాడుకు హాజరయ్యారు. దీంతో నందమూరి కుటుంబంలో విభేదాలు తొలగిపోయాయని నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు భావిస్తున్నారు.