అభిమానం డబ్బులిస్తే రాదు: బాలయ్య
posted on Jun 11, 2013 @ 10:55AM
నందమూరి నటసింహం బాలకృష్ణ తన బర్త్ డే వేడుకలు అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. రామకృష్ణ సినీ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా ప్రారంబించారు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ’ సినిమా ఘనవిజయం సాధించింది. శ్రీమన్నారాయణ సినిమా తరువాత బాలకృష్ణ చేస్తున్న చిత్రం ఇది.
ఈ సంధర్భంగా బాలకృష్ణ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ “నాకు జన్మనిచ్చింది ఎన్టీఆర్ దంపతులు అయితే ఇంతవాడిని చేసింది అభిమానులు. అభిమానం అనేది గుండెలోతుల్లోంచి రావాలి తప్పితే ..డబ్బులిస్తేనో..ప్రలోభాలకు గురిచేస్తేనో రాదు” అని అన్నారు. “కొందరు ఆశించడానికి పుడితే..మరి కొందరు శాసించడానికి పుడతారు” అని కొత్త సినిమా డైలాగ్ కొట్టి అభిమానులను ఆనందపరిచారు బాలయ్య. 2014 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేస్తానంటున్న బాలకృష్ణకు ఇది ఆఖరు చిత్రం అవుతుందా..లేక ఈ లోపే 100వ చిత్రం మొదలు పెడతారా ? చూడాలి.